Bigg Boss Telugu 7: పకడ్బందీగా బిగ్ బాస్ 7 ప్లాన్ చేసిన మేకర్స్… బయటపెట్టిన నాగార్జున!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో సీజన్ సెవెన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమో విడుదల చేయడంతో పాటు నాగార్జున కుడి ఎడమైతే పొరపాటు లేదు అంటూ చెప్పే ఒక టీజర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జున ఇలా కుడి ఎడమైతే పొరపాటు లేదు అని చెప్పడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

బిగ్ బాస్ 9Bigg Boss Telugu 7) కార్యక్రమం మరికొద్ది రోజులలో ప్రసారం కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఆరు సీజన్లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు అందరితో కలిసి స్టార్ మా బిగ్ బాస్ షైనింగ్ స్టార్స్ అనే పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇదివరకు ఆరు సీజన్లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా పాల్గొని సందడి చేశారు.

అలాగే ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు. ఇక చివరిలో నాగార్జున గ్రాండ్ గా ఈ వేదిక పైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమ నాగార్జునను ప్రశ్నిస్తూ బిగ్ బాస్ 7 టీజర్ లో మీరు కుడి ఎడమైతే అంటూ చెప్పారు అసలు దాని అర్థం ఏంటి సర్ అంటూ ప్రశ్నించారు.

సుమ ఇలా ప్రశ్నించడంతో నాగార్జున సమాధానం చెబుతూ.. న్యూ గేమ్.. న్యూ చాలెంజెస్… న్యూ రూల్స్ అంటూ సమాధానం చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈసారి ఈ కార్యక్రమం చాలా పకడ్బందీగా అలాగే చాలా కొత్తగా నిర్వహించబోతున్నారని నాగార్జున ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. మరి ఈ కార్యక్రమం ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus