Nagarjuna: సౌత్ ఇండస్ట్రీని ఇండియా ఫాలో అవుతుంది!

  • November 1, 2023 / 10:44 PM IST

సినీ నటుడు నాగార్జున తాజాగా హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించినటువంటి ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జునతో సినీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది. ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి కింగ్ నాగార్జున మాట్లాడుతూ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని ఈయన వెల్లడించారు. ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిందని, టెక్నికల్గా ప్రతి ఒక్కరంగంలోని ఎన్నో మార్పులు వస్తున్నాయని ఈయన వెల్లడించారు. తమ తండ్రిగారు 1974 వ సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియోని ప్రారంభించారు అయితే అప్పట్లో నేను నెలకు ఒక సినిమా షూటింగ్ జరిగిన చాలు అనుకునేవాడిని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల పరిణామాలు వచ్చాయి.

ఎంతో మారింది. హైదరాబాద్ అనేది సినిమా పరిశ్రమకు రాజధానిలా మారనుంది. సౌత్ ఫిల్మ్స్‌ని ఇండియా అంతా ఫాలో అవుతోంది అని నాగార్జున తెలిపారు..ఇక సౌత్ లో ఎంతో టాలెంటెడ్ కలిగినటువంటి డైరెక్టర్లు ఉన్నారని మేము ఆస్కార్ వరకు కూడా వెళ్ళాము అంటూ ఈ సందర్భంగా నాగార్జున తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఎంతో సహకరిస్తున్నారు. గేమింగ్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ వంటి వారి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడకు రండి. మా అన్నపూర్ణ కాలేజ్‌లోనూ కోర్సులున్నాయంటూ ఈ సందర్భంగా నాగార్జున వెల్లడించారు. ఇలా సౌత్ సినిమాల గురించి ఈ సందర్భంగా (Nagarjuna) ఈయన మాట్లాడినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus