Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీ ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎందుకంటే జనాలను ఆకర్షించే కంటెంట్ చేయాలని దర్శకనిర్మాతలు ఆలోచించడం లేదు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే మ్యాగ్జిమమ్ రాబట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. అయితే హీరో లేదా దర్శకుల మార్కెట్ పై.. లేదు అంటే డిజిటల్ సంస్థల పై ఆధారపడి సినిమాలు నిర్మిస్తున్నారు. అందుకే ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. ఈ సమస్యని నాగార్జున ముందే ఊహించారు. దాని లోతుని కూడా విశ్లేషించారు.

Nagarjuna

గతంలో నాగార్జున మాట్లాడుతూ.. “నిజమే…! ఇప్పుడు ఇండస్ట్రీకి వరస్ట్ పీరియడ్ నడుస్తుంది. ఎందుకంటే.. ఒక డిసిప్లిన్ పోయింది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎప్పుడూ ఒకలా ఉండాలి. నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అలాగే ఉండేవారు.యాక్టర్స్ ని అంటే మమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేవారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒక టీంలా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రొడ్యూసర్, హీరో ఒక టీంలా ఉంటున్నారు లేదు అంటే డైరెక్టర్, హీరో ఒక టీంలా ఉంటున్నారు.

దీనికి పరిష్కార మార్గం అంటూ లేదు. వాళ్ళను అలాగే ఉండనివ్వండి. పడనివ్వండి. అన్ని డోర్స్ మూసుకుపోయినప్పుడు.. ఒక ఆర్డర్, డిసిప్లిన్ పుడుతుంది. అప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ రైజ్ అవుతుంది. అప్పుడు అనుకున్న మార్పు వస్తుంది. అప్పటివరకు మనం కోరుకున్న మార్పు రాదు” అంటూ చెప్పుకొచ్చారు. నాగార్జున చేసిన కామెంట్స్ నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అనేది ఇన్సైడ్ ఒపీనియన్.

ఇప్పుడు దర్శకులకి.. నిర్మాతకి ఒక రకమైన గ్యాప్ ఉంది. నిర్మాత హీరోనే దేవుడిలా చూస్తున్నాడు. అతని మార్కెట్ తో సేఫ్ అయిపోవాలనే ఎజెండాతో సినిమాలు చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకుంటే చాలు అన్నట్టు నిర్మాత ఆలోచనా విధానం ఉంది. నాగార్జున చెప్పినట్టు దర్శకుడు, నిర్మాత అండ్ టెక్నికల్ మెంబర్స్ అంతా ఒక టీమ్…లా ఉంటేనే మంచి ఔట్పుట్ వస్తుంది. మరి ఆ మార్పు ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags