Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

కొంతమంది స్టార్ దర్శకులకు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళతో తమ అభిప్రాయాలను షేర్ చేసుకుని మంచి ఔట్పుట్ రాబట్టుకోగలరు. ఉదాహరణకి రాజమౌళినే తీసుకోండి. ఆయనకు మొదటి నుండి కీరవాణితో పనిచేయడం కంఫర్ట్. ఇప్పటివరకు రాజమౌళి చేసిన ప్రతి సినిమాకి కీరవాణినే సంగీత దర్శకుడు. అలాగే సుకుమార్ ని తీసుకుంటే.. అతనికి దేవి శ్రీ ప్రసాద్ తో పనిచేయడం కంఫర్ట్. సుకుమార్ చేసిన 9 సినిమాలకి దేవి శ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు.

Jr NTR

‘పుష్ప 2’ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ పై చాలా కంప్లైంట్స్ వచ్చినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అతన్ని తప్పించి తమన్ వంటి వాళ్ళతో పని చేయించుకున్నా చివరికి దేవి శ్రీ ప్రసాద్ కే క్రెడిట్స్ ఇచ్చాడు సుకుమార్. వాళ్ళ బాండింగ్ అలాంటిది.సరిగ్గా ఇలాంటి బాండింగే ప్రశాంత్ నీల్ -రవి బసృర్..లది..! ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ‘ఉగ్రం’ నుండి ‘సలార్’ వరకు సంగీత దర్శకుడిగా రవి బసృర్ నే పెట్టుకుంటున్నాడు.

అయితే ఇప్పుడు ఈ కాంబోకి బ్రేక్ పడే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. దీనికి కూడా రవి బసృర్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఆయన కొన్ని కంపొజిషన్స్ చేశారట. కానీ వాటితో ఎన్టీఆర్ సంతృప్తిగా లేడు అని తెలుస్తుంది. దీంతో ప్రశాంత్ నీల్ పై పరోక్షంగా ఒత్తిడి పెడుతున్నట్టు సమాచారం. వాస్తవానికి రవి బసృర్ తో ఒక ప్రాబ్లమ్ ఉంది.

అదేంటంటే.. అతను కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తాడు. అది కూడా టూ లౌడ్ ఉంటుంది. కానీ పాటల విషయంలో అతని తేలిపోతాడు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ తో కూడా సేమ్ కంప్లైంట్ ఉంటుంది. అయితే రవిని రీప్లేస్ చేయాలనే ఆలోచన నిర్మాతలైన ‘మైత్రి’ వారికి వచ్చిందట. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఇందుకు ఒప్పుకునే అవకాశాలు లేవు. ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ మాట వినాల్సిందే. చూడాలి మరి ఏమవుతుందో..!

సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus