శనివారం కింగ్ నాగార్జున ఇరగదీశాడు. బిగ్ బాస్ షోలో ఉన్న అసలు మజా ఇదే..!

బిగ్ బాస్ రియాలిటీ షోలో శనివారం ఎపిసోడ్ కోసమే ప్రేక్షకులు ఎదురుచూస్తారు. హౌస్ట్ వచ్చి హౌస్ మేట్స్ తప్పులు ఎత్తిచూపిస్తున్నా, వారి దొంగవేషాలు కనిపెట్టి బయటకి చూపిస్తున్నా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. మూడోవారం బిగ్ బాస్ హౌస్ లో కింగ్ నాగార్జున ఇచ్చిన డోస్ కి స్టార్ మా సీరియల్ బ్యాచ్ కి ఫీజులు ఎగిరిపోయాయ్. దీంతో అందరూ బాగా సెట్ అయిపోయారు. ముఖ్యంగా ప్రిన్స్ ని టార్గెట్ చేస్తూ శోభాశెట్టి కంటెండర్ షిప్ నుంచీ ఎలిమినేట్ చేయడాన్ని తప్పుబట్టారు హోస్ట్ నాగార్జున.

అక్కడ బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయమనలేదని, ముగ్గురిలో వీక్ ఎవరో చెప్పమని చెప్పాడని అన్నాడు. దీంతో సంచాలక్ సందీప్ అక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్పలేదని ఎందుకు ప్రిన్స్ ని ఎలిమినేట్ చేస్తుంటే చూస్తూ ఉండిపోయావని అన్నాడు. దీనికి సందీప్ ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. కన్ఫూజన్ అయ్యానని క్లియర్ గా ఒప్పుకున్నాడు. దీంతో సందీప్ ఛార్జింగ్ లో నుంచీ ఒక పాయింట్ ని తగ్గించాడు. తర్వాత ప్రియాంకకి ఫుల్ క్లాస్ పీకాడు కింగ్ నాగార్జున. అమర్ దీప్ ని గేమ్ లో ఎందుకు తప్పించావ్ అని అడుగుతూనే మళ్లీ డెసీషన్ మార్చుకుందామని ఎందుకు చెప్పావ్ అని లాక్ చేశాడు.

ప్రిన్స్ ని ఎందుకు గేమ్ లో నుంచీ తప్పించావ్ అని క్లారిటీగా చెప్పమని నిలదీశాడు. దీంతో ప్రియాంక కవర్ చేస్తూ ఆన్సర్స్ ఇవ్వబోయింది. దీనికి నాగార్జున ఆమెని ప్రతి పాయింట్ లో లాక్ చేశాడు. ఇక అమర్ దీప్ కి కూడా ఒక రేంజ్ లో క్లాస్ పడింది. గతవారం మాయాస్త్రం టాస్క్ లో పల్లవి ప్రశాంత్ ఇదే రీజన్ చెప్పి నిన్ను గేమ్ లో నుంచీ తప్పిస్తే బాగా ఎగిరావ్ ? ఇప్పుడు ప్రియాంక చెప్తే ఎందుకు సైలెంట్ గా ఉండిపోయావ్ ? నీ గేమ్ నువ్వు ఆడు అంటూ సలహా ఇచ్చాడు.

అంతేకాదు, అమర్ దీప్ శివాజీ పవర్ అస్త్రాన్ని ఎందుకు కొట్టేశావ్ ? మళ్లీ తిరిగి ఎందుకు ఇచ్చేశావ్ ? ఇలా చేస్తే గేమ్ లో నీకు క్లారిటీ లేదని అనుకుంటారు అంటూ క్లాస్ పీకాడు నాగార్జున. శోభాశెట్టికి కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆమె పవర్ అస్త్రాని గెలిచిన మూడో కంటెస్టెంట్ అయినప్పటికీ చికెన్ టాస్క్ లో గౌతమ్, ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరి ఎఫోర్ట్స్ కూడా ఉన్నాయని గుర్తుచేశారు. అక్కడ సందీప్ సంచాలక్ గా రైట్ డెసీషన్ తీస్కున్నాడని చెప్తూనే., కన్ఫూజ్ అవ్వద్దని సందీప్ కి వార్నింగ్ ఇచ్చారు.

అలాగే, శోభాశెట్టి గేమ్ కూడా పక్కదొవ పడుతోంది జాగ్రత్త అని హెచ్చరించారు. గౌతమ్ షర్ట్ విఫ్పి షో చేసినందుకు క్లాస్ పడింది. అలా షర్ట్ విప్పితే దాన్ని మేము షో ఆఫ్ అనే అనుకుంటామని క్లియర్ గా చెప్పాడు. ఇక ఈ శనివారం హౌస్ మేట్స్ కి బాగానే కోటింగ్ ఇచ్చారు నాగార్జున. ఆడియన్స్ ఈ ఎపిసోడ్ ని బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు, తమ మనసులో మాటల్ని బయటపెట్టి మరీ అందరికీ క్లాస్ పీకారని క్లాప్స్ కొట్టారు. మొత్తానికి అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus