వైల్డ్ డాగ్ థియేటర్ రిలీజ్ కి కారణాలు చెప్పిన నాగార్జున!

సరిగ్గా మూడు నెలల క్రితం ప్రతి నిర్మాత మనసులో ఒకే ఆలోచన “ఈ సమయంలో జనాలు థియేటర్లకు వస్తారా?”. కరోనా ప్రభలుతున్న తరుణం, లక్షల్లో కేసులు, వేలల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అప్పటికే స్టార్ హీరోలైన సూర్య, నానిలతోపాటు స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి, కీర్తి సురేష్ లు కూడా తమ సినిమాలను ఆన్ లైన్లో విడుదల చేసి ప్రమోషన్స్ చేసేస్తున్నారు. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన సినిమాలన్నీ ఒటీటీ రిలీజులే అని ఫిక్స్ అయిపోయారు. షూటింగ్ ఇంకా 50% కూడా పూర్తవ్వని సినిమాలు మినహా అన్నీ కుదిరినంత త్వరగా ఒటీటీకి అమ్మేసుకొని వడ్డీ కష్టాల నుంచి బయటపడిపోవాలని నిర్ణయించేసుకున్నాడు ప్రతి నిర్మాత.

ఆఖరికి అక్కినేని నాగార్జున కూడా ఈ ఒటీటీ రిలీజ్ కి ఒకే చెప్పడం, ఆయన నటించిన “వైల్డ్ డాగ్” నెట్ ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకి కొనేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఏప్రిల్ లో నెట్ ఫ్లిక్స్ లో సినిమా రిలీజ్ అని గుసగుసలు కూడా వినిపిస్తున్న తరుణంలో నాగార్జున చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఇవాళ హైద్రాబాద్ లో నిర్వహించిన మీడియా బ్రీఫింగ్ లో నెట్ ఫ్లిక్స్ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకొని.. “వైల్డ్ డాగ్”ను ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు నాగార్జున. సంక్రాంతికి విడుదలైన “క్రాక్”, ఫిబ్రవరిలో విడుదలైన “ఉప్పెన” చిత్రాల రిజల్ట్స్ తన డెసిషన్ మార్చుకోవడానికి కారణాలని చెప్పుకొచ్చాడు.

ఒక కొత్త కుర్రోడు చేసిన సినిమా ఉప్పెన హిట్ అయ్యిందంటే.. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు, అందుకే మా “వైల్డ్ డాగ్”ను కూడా థియేటర్లలోనే విడుదల చేస్తున్నాం. అగ్రిమెంట్ కి క్యాన్సిల్ చేయడానికి నిర్మాత నిరంజన్ రెడ్డి తన లాయర్ తెలివితేటలు బాగా వాడారని ఆయన ప్రస్తావించడం గమనార్హం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో “రేయ్” ఫేమ్ సయామీ ఖేర్ కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. మరి నాగార్జున ఆశలు ఎంతవరకు ఫలిస్తాయి? సినిమా రిజల్ట్ “క్రాక్, ఉప్పెన”ల స్థాయిలో ఉంటుందా? వంటి ప్రశ్నలకు సమాధానం ఏప్రిల్ 2న తెలుస్తుంది.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రేర్ ఫోటో గ్యాలరీ!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus