‘స్టార్ మా’ ను వణికిస్తున్న నాగార్జున వీడియో?

  • June 19, 2019 / 06:24 PM IST

తెలుగులో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో కు మంచి ఆధారణ దక్కించుకుంది. మొదటి సీజన్ ను జూ.ఎన్టీఆర్ హోస్ట్ చేసాడు, రెండో సీజన్ ను నాని హోస్ట్ చేసాడు. ఇక మూడో సీజన్ ను కింగ్ నాగార్జున హోస్ట్ చేయబోతున్నాడనే వార్త బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో నాగార్జునే ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సీజన్ 3 ఎప్పుడు మొదలవుతుంది అనే దాని పై మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ దీనికి సంబందించిన ప్రోమో కూడా మొదలు పెట్టారని టాక్ నడిచింది.

అది నిజమేనని తాజాగా ఓ లీకైన వీడియో స్పష్టం చేస్తుంది. నాగార్జున షూట్ వేసుకుని మంచి స్టైలిష్ గా ఉన్న ఈ పిక్ ‘బిగ్ బాస్3’ పై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతా బానే ఉంది కానీ.. సీజన్ 2 లో కూడా ఎవరు ఎలిమినేట్ అయ్యేది ఇలా లీకులు అయ్యేవి. అయితే ఈసారి మాత్రం షో లో ఎటువంటి లీక్ లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ‘స్టార్ మా’ వారు భావించారట. అయినప్పటికీ ఇలా లీకులు రావడంతో వారు షాక్ కి గురయ్యారు. దీంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని యూనిట్ సభ్యులను హెచ్చరించారట. షో కి వచ్చే ప్రేక్షకుల దగ్గర్నుండీ సెల్ ఫోన్లను ఎంట్రీ దగ్గరే తీసుకోవాలని వారు చెప్పారట. ఇక ఎన్టీఆర్, నాని లను మైమరిపించేలా నాగ్ ఈ సీజన్ ను నడిపిస్తాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల జూలై 21 నుండీ ‘బిగ్ బాస్3’ మొదలుకానుందని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus