మహేష్ జక్కన్న కాంబో సినిమాలో నాగార్జున నటించనున్నారా?

మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. అధికారికంగా క్లారిటీ లేకపోయినా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ కాంబినేషన్ గురించి వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. రాజమౌళి డైరెక్షన్ లో ఛాన్స్ అంటే నాగ్ నో చెప్పే అవకాశం లేదు.

నాగార్జునకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీలో మరి కొందరు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం నటించనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం. మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయని తెలుస్తోంది.

హాలీవుడ్ నటీనటులకు సైతం ఈ సినిమాలో ఛాన్స్ దక్కనుందని భోగట్టా. జక్కన్న ఈ సినిమా కోసం దాదాపుగా ఐదేళ్ల సమయం కేటాయిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఈ సినిమాను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఈ సినిమా తొలి సినిమా కావడంతో మహేష్ ను జక్కన్న ఏ విధంగా చూపిస్తారనే చర్చ కూడా జరుగుతోంది.

(Mahesh Babu) మహేష్ బాబు, రాజమౌళి ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ లెవెల్ లో పబ్లిసిటీ జరిగేలా జక్కన్న ప్లానింగ్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 1500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయని తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus