బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం కెప్టెన్సీ టాస్క్ విషయంలో కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ పై ఫుల్ సీరియస్ అయ్యారు. తన – మన భేదం లేకుండా అందరికీ ఫుల్ గా క్లాస్ పీకారు. శివాజీ చెప్పిన రీజన్స్ ని ఖండిస్తూ ఎక్కడికక్కడ లాజిక్స్ మాట్లాడారు. దీంతో శివాజీ సీరియల్ బ్యాచ్ పై పగ పెట్టేసుకున్నాడని ఆడియన్స్ కి అర్దం అయ్యింది. అయితే అసలు ఎందుకు హోస్ట్ నాగార్జున ఇంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది ? తెర వెనుక బిగ్ బాస్ టీమ్ ఎవరికి సపోర్ట్ చేస్తోందనే అనుమానాలు బిగ్ బాస్ ఆడియన్స్ లో ఆసక్తిని రేపుతున్నాయి.
శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే., ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ అవ్వగానే ఎవరికి వాళ్లే స్ట్రాటజీలు ఏంటనేది మాట్లాడుకున్నారు. గౌతమ్ అయితే అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడాడు. నిజానికి అర్జున్ అమర్ కి కెప్టెన్సీ ఇమ్మని చెప్పాడని గౌతమ్ ప్రియాంకతో చెప్పాడు. కానీ ఇది నిజం అని హోస్ట్ నాగార్జున నమ్మలేదు. కెప్టెన్సీ పోటీలో శివాజీ ఒక్కడే ల్యాగ్ చేసి టాస్క్ రద్దు అయ్యేలా చేశాడు. తెగే వరకూ లాగి లాస్ట్ కి బిగ్ బాస్ టాస్క్ రద్దు చేస్తున్నాను అని ఎనౌన్స్ చేస్తుంటే.,అప్పుడు వచ్చి శివాజీ అమర్ కి ఇస్తున్నానని సపోర్ట్ చేశాడు.
కానీ, టాస్క్ మాత్రం రద్దు అయిపోయింది. ఇదే విషయాన్ని కింగ్ నాగార్జున చెప్తుంటే, డిప్యూటీస్ గా ప్రియాంకకి – శోభకి ఇస్తానని చెప్పాడని అది అస్సలు నచ్చలేదని అన్నాడు. దీంతో ప్రియాంకని ఇన్వాల్ చేశాడు హౌస్ట్ నాగార్జున. ఫస్ట్ నూంచీ కూడా వీళ్లు మాట వినరని, చాలా యారేగెంట్ గా బిహేవ్ చేస్తారని అన్నాడు. దీనికి ప్రియాంక కౌంటర్ ఇస్తూ వర్క్ విషయంలో డిప్యూటీస్ కూడా వచ్చి వర్క్ చేస్తున్నారని చెప్పింది. కానీ, శివాజీ అబద్దాలు చెప్పకు అని, చెప్పేవన్నీ ఇంతే అని, ఫస్ట్ నుంచీ కూడా వీళ్ల ముగ్గురూ ఇలాగే ఉన్నారని అన్నాడు. దీంతో ప్రియాంకకి – శివాజీకి గట్టి ఆర్గ్యూమెంట్ జరిగింది.
హోస్ట్ నాగార్జున ప్రియాంకని మాట్లాడద్దని గట్టిగా చెప్తే అప్పుడు ఆపసింది. ఇక బ్రేక్ టైమ్ లో కూడా శివాజీ పై రుసరుస లాడింది. మేమేం అబద్దాలు చెప్పామని నిలదీసింది. అలాగే అమర్ కూడా తన విషయంలో కావాలనే శివాజీ ఇలా చేశాడని అభిప్రాయ పడ్డాడు. యావర్ ప్రియాంక కెప్టెన్సీని తప్పుబట్టాడు. జస్ట్ ఓకే అనిపించిందని అన్నాడు. తర్వాత శివాజీ కన్ఫషన్ రూమ్ హైడ్రామా మరోసారి వచ్చింది. నిజంగా శివాజీ వెళ్లిపోతానని చెప్పాడు. వచ్చేవి పెద్ద పెద్ద టాస్క్ లు అందులో పెర్ఫామ్ చేయకపోతే కప్ ఇచ్చినా వేస్ట్ అన్నట్లుగా మాట్లాడాడు.
అయితే బిగ్ బాస్ టీమ్ మాత్రం ఫినాలే వరకూ శివాజీని ఆడించే తీరతారని ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఈ సీిరియల్ బ్యాచ్ కి ముక్కుతుడా వేయాలంటే శివాజీ లాంటి ప్లేయర్ లాస్ట్ ఫినాలే వరకూ ఉండాల్సిందే అంటున్నారు. మొత్తానికి తెర వెనుక ఫైనల్స్ వరకూ కూడా శివాజీని పంపించకుండా బిగ్ బాస్ పెద్ద ప్లానే వేశాడు. అందుకే, హోస్ట్ నాగార్జున పార్టిసిపెంట్స్ పై కొద్దిగా సీరియస్ అయ్యాడు. ఇక్కడ్నుంచీ అయినా వాళ్లు గ్రూప్ గేమ్ ని వదిలేసి వస్తేనే వాళ్లు సత్తా ఏంటో తెలుస్తుందొని కొందరి వాదన. అదీ మేటర్.