Nagarjuna, Balakrishna: అన్ స్టాపబుల్ షోకు పిలిస్తే నాగ్ అలా అన్నారా?

స్టార్ హీరో బాలకృష్ణ, స్టార్ హీరో నాగార్జున మధ్య కొంత గ్యాప్ ఉందని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అన్ స్టాపబుల్ సీజన్2 కు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా బిగ్ బాస్ సీజన్6 కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్3 నుంచి నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా బాలయ్య ఈ షోకు ఎప్పుడూ హాజరు కాలేదనే సంగతి తెలిసిందే. అయితే అన్ స్టాపబుల్ సీజన్2 కు నాగార్జునను పిలవాలని ఈ షో నిర్వాహకులు ప్రయత్నించారు.

ఈ షో కోసం చిరంజీవి, నాగార్జునలను సంప్రదించగా చిరంజీవి ఈ షోకు యస్ చెప్పారని నాగార్జున మాత్రం నో చెప్పారని బోగట్టా. అన్ స్టాపబుల్ సీజన్2 కు తాను హాజరు కాలేనని నాగ్ సున్నితంగా నో చెప్పినట్టు తెలుస్తోంది. నాగ్ ఈ షోకు హాజరైతే చైసామ్ విడాకుల గురించి బాలయ్య నుంచి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉండటం వల్ల కూడా నాగ్ ఈ షోకు హాజరు కావడానికి నో చెప్పినట్టు బోగట్టా. ఈ మధ్య కాలంలో నాగ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

కెరీర్ విషయంలో నాగ్ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. బిగ్ బాస్ సీజన్6 సైతం ఆశించిన స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకోవడం లేదు. ఈ రీజన్స్ వల్ల కూడా నాగ్ ఈ షోకు హాజరు కావడానికి ఆసక్తి చూపలేదని సమాచారం అందుతోంది. తారక్ ఈ షో విషయంలో ఆసక్తితో ఉన్నా బాలయ్య ఆసక్తి చూపడం లేదు. అన్ స్టాపబుల్ షో సీజన్2 కు గెస్ట్ లు దొరకడం కష్టమవుతుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారం విషయంలో షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఆహా ఓటీటీకి ఈ షో ద్వారా సబ్ స్క్రైబర్ల సంఖ్య అంచనాలకు అందని స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంటూ ఇతర ఓటీటీలకు గట్టి పోటీ ఇస్తుండటం గమనార్హం.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus