Nagarjuna, Mahesh Babu: నాగార్జున – మహేష్ ల సినిమా.. ట్వీట్ల వెనుక అంత కహానీ ఉందా?

ఈరోజు నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు. ట్రైలర్ చాలా బాగుంది. కథ ఎలా ఉన్నా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అదిరిపోయాయి. ఇక మహేష్ బాబు ట్రైలర్ రిలీజ్ చేయడంతో నాగార్జున స్పెషల్ గా థాంక్స్ చెబుతూ ట్వీట్ వేశాడు. అంతేకాకుండా 29 ఏళ్ళ క్రితం వారసుడు చిత్రంలో మహేష్ తండ్రి కృష్ణ తో కలిసి నటించిన విషయాన్ని నాగార్జున గుర్తు చేసి.. ఆ సైకిల్ ను మనం కూడా ఫిల్ చెయ్యాలి కదా అంటూ నాగార్జున ట్వీట్ లో పేర్కొన్నాడు. దీనికి మహేష్ బాబు బదులిస్తూ..’ నేను కూడా ఆ మూమెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను ‘ అనే అర్థం వచ్చేలా రిప్లై ఇచ్చాడు.

వీళ్ళు సరదాగా చేసుకున్న చాట్ లా ఇది కనిపిస్తున్నప్పటికీ వెనుక చాలా కథ ఉందనే సంకేతాలు అందుతున్నాయి. నిజానికి వీళ్ళ కాంబో ఎప్పుడో సెట్ అవ్వాలి. మణిరత్నం దర్శకత్వంలో ఈ కాంబినేషన్ లో మల్టీస్టారర్ రూపొందుతుందనే ప్రచారం గతంలో జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. మరి ఇన్నాళ్లు ఈ విషయం పై సైలెంట్ గా ఉన్న ఈ స్టార్లు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు అంటే దాని వెనుక కథ వేరే ఉందని స్పష్టమవుతుంది.

త్రివిక్రమ్ తో సినిమా పూర్తయ్యాక మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఈ సినిమాలో ఓ సీనియర్ స్టార్ హీరో కి సరిపడా పాత్ర కూడా ఉంది అని ఇన్సైడ్ టాక్. ఆ పాత్ర కోసం రాజమౌళి … నాగార్జునని అనుకుంటున్నాడట. బ్రహ్మాస్త్రం సినిమా ప్రమోషన్స్ కోసం నాగార్జున – రాజమౌళి కలిసి చాలా ఎక్కువ తిరుగుతున్నారు. అదే టైంలో మహేష్ సినిమా డిస్కషన్ కూడా వీరి మధ్య వచ్చినట్టు తెలుస్తోంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus