Nagarjuna: ‘వైల్డ్ డాగ్’ కు మించి కష్టపడుతున్న నాగ్..!

పాపం.. 60 ఏళ్ళ వయసులో కూడా నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మూవీని ఎంతో కష్టపడి చేసాడు. యాక్షన్ సీక్వెన్స్ లో లిటిరల్ గా బ్లడ్ పెట్టి పని చేసాడు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది. అమ్మిన దానిలో సగం కూడా రికవర్ కాక బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఆ నష్టాలను తన తరువాతి సినిమాలతో తీర్చాలని నాగార్జున భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్లో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని చేస్తున్నాడు.

‘లవ్ స్టోరీ’ నిర్మాతలైన నారాయణదాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు లతో కలిసి శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాజల్‌ హీరోయిన్ కావడంతో ఈ సినిమా పై బజ్ ఏర్పడింది. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని సమాచారం. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ ను పూర్తి చేశారట చిత్ర యూనిట్ సభ్యులు.త్వరలో రెండో షెడ్యూల్‌ కూడా ప్రారంభం కాబోతుంది.ఈ నేపథ్యంలో నాగార్జున పై కీలక యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తారట.

దీనికోసం నాగ్‌ ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేస్తున్నాడట. క్రావ్‌ మాగా, సమురై స్వొర్డ్‌ అనే ఇజ్రాయెల్‌ యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఆయన ఓ మాజీ రా ఏజెంట్‌ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. జులై నుండీ ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘వైల్డ్ డాగ్’ కు మించి ఈ చిత్రం కోసం నాగ్ కష్టపడుతున్నాడు. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో..!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus