Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?

సూపర్ స్టార్ రజనీకాంత్   (Rajinikanth)  నటిస్తున్న ‘కూలీ’ (Coolie) సినిమాపై సౌత్ అంతా కన్నేసి ఉంది. లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం, మాస్ యాక్షన్ ట్రీట్‌, గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యం, భారీ బడ్జెట్.. ఇలా అన్ని అంశాల్లో హైప్ పెరుగుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్ ఎవరికి దక్కబోతోతున్నాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇందులో కింగ్ నాగార్జున (Nagarjuna)  కీలక పాత్రలో నటిస్తున్నారన్న విషయం తెలుగులో ఆసక్తి పెంచే అంశంగా మారింది.

Nagarjuna

తాజాగా నాగార్జున స్వయంగా ‘కూలీ’ తెలుగు హక్కుల కోసం బిజినెస్ రంగంలోకి దిగినట్టు సమాచారం. రైట్స్ ధరపై నిర్మాతలు 40 కోట్ల డిమాండ్ పెడుతుంటే, నాగ్ మాత్రం 35 కోట్ల పరిధిలో డీల్ ఫిక్స్ చేయాలని ట్రై చేస్తున్నట్టు చెన్నై వర్గాల టాక్. ఆయన ఈ డీల్‌ను ప్రాక్టికల్ కోణంలో అంచనా వేస్తున్నారు. గతంలో చాలా తమిళ డబ్ సినిమాలు తెలుగులో పట్టు సాధించలేకపోయాయి.

ఆ అనుభవం చేతిలో ఉండటంతోనే ఆయన ఒక నమ్మదగిన ప్రాసెసుతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్, సితార, దిల్ రాజు (Dil Raju)  వంటి పెద్ద సంస్థలు కూడా రైట్స్ కోసం పోటీ పడుతున్నాయని ఇండస్ట్రీ టాక్. కానీ నాగార్జున పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్న నేపథ్యంలో, ఆయన చేతిలోనే డీల్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ చూసిన ప్రేక్షకులు కూడా “నాగ్ లుక్‌ మెరుపులా ఉంది” అంటూ స్పందించడం ఆసక్తికరం.

ఒకవేళ నాగార్జున ‘కూలీ’ రైట్స్‌ను తీసుకుంటే, ఇది ఆయనకు డిస్ట్రిబ్యూషన్ పరంగా కొత్త అడుగు అవుతుంది. ఫ్యామిలీ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌ తోనే సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే ప్లాన్ ఉందట. మిగతా బయ్యర్ల పోటీ, మార్కెట్ బలహీనతలతో పాటు తమిళ డబ్ సినిమాలపై నమ్మకంలేని పరిస్థితుల మధ్య ఈ నిర్ణయం కింగ్ కు లాభం అవుతుందా లేక రిస్క్ అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus