Nagarjuna: చిరు డైరెక్టర్ తో నాగార్జున సినిమా!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’, నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ రెండు సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్ 5న ఈ సినిమాను ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ‘ది ఘోస్ట్’ సినిమా రిజల్ట్ నాగార్జునకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకున్నాయి. సరైన ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. ఈ క్రమంలో ‘ది ఘోస్ట్’ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు నాగార్జున.

ఈ సినిమా రిజల్ట్ పై నాగార్జున కెరీర్ ఆధారపడి ఉంది. అయితే ఈ సినిమాతో పాటు ‘గాడ్ ఫాదర్’ సినిమా రిజల్ట్ పై కూడా ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా.. నాగార్జునతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు. చాలా రోజులుగా ఓ కథను సిద్ధం చేసుకొని నాగార్జున చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయాన్ని ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్స్ లో మోహన్ రాజా స్వయంగా వెల్లడించారు. నాగ్ కోసం ఒక కథ రెడీగా ఉందని చెప్పారు.

అయితే ఈ కథను ఓకే చేయాలా..? వద్దా..? అనే సందిగ్థంలో ఉన్నారు నాగార్జున. ‘గాడ్ ఫాదర్’ సినిమా గనుక సూపర్ హిట్ అయితే.. కచ్చితంగా నాగార్జున ఓకే చెప్పడం ఖాయం. అందుకే ‘గాడ్ ఫాదర్’ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు నాగార్జున. ప్రస్తుతం నాగార్జున వందో సినిమా మైలురాయికి దగ్గరాలవుతున్నారు. ‘గాడ్ ఫాదర్’ సినిమా హిట్ అయితే కచ్చితంగా వందో సినిమాను మోహన్ రాజా చేతిలో పెడతారు.

మరి ‘గాడ్ ఫాదర్’ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. మెగాస్టార్ కి కూడా ఈ సినిమా చాలా కీలకం. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఈ సినిమా హిట్ అయితేనే చిరు నెక్స్ట్ సినిమాలపై బజ్ ఏర్పడుతుంది. లేదంటే అంతే సంగతులు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus