మహేష్ ని చేరుకోబోతున్న నాగార్జున!

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున. టాలీవుడ్ లో అందమైన హీరోగా పేరుతెచ్చుకున్న మరో స్టార్ మహేష్ బాబు. వీరిద్దరికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాగే బాహుబలి సినిమాలతో రానా కూడా ఎక్కువమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అందుకే ట్విట్టర్ లోమహేష్, రానా, నాగ్ కి ని ఫాలో అయ్యే వారు కూడా ఎక్కువమంది ఉన్నారు. టాలీవుడ్ లో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో వీరు ముందు వరుసల్లో నిలిచారు. మహేష్ బాబు 4.61 మిలియన్స్ ఫాలోవర్స్ తో తొలిస్థానంలో నిలువగా.. 4 మిలియన్స్ ఫాలోవర్స్‌ తో నాగార్జున, దగ్గుబాటి రానా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ట్విట్టర్లో నాగార్జున జోరు చూస్తుంటే మహేష్ ని అందుకునేలా ఉన్నారు. ఇక సౌత్ మొత్తాన్ని తీసుకుంటే 6 మిలియన్స్ ఫాలోవర్స్‌తో  హీరో ధనుష్ ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి  4.31 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్న పవన్‌కళ్యాణ్ కి  2.1 మిలియన్స్‌ మంది మాత్రమే ఫాలో అవుతున్నారు.   సినిమా గురించి కాకుండా రాజకీయాల గురించి ప్రస్తావించడం వల్ల ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో పర్సనల్, ప్రొఫిషనల్ విశేషాలను పోస్ట్ చేసే  అల్లు అర్జున్ 1.7 మిలియన్ మంది అనుసరిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus