‘భవిష్యత్తులో డిజిటల్ కంటెంట్ జోరు ఊపందుకుంటుంది.. ఓటిటి సంస్థలకు డిమాండ్ పెరుగుతుంది’ అని అల్లు అరవింద్ గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆయన అలా చెప్పిన 3 నెలలకే.. ఓటిటిల హవా నిజంగానే పెరిగింది. కరోనా కారణంగా లాక్ డౌన్ ఏర్పడడం.. దాని వల్ల థియేటర్లు మూతపడటంతో ఓటిటిల హవా పెరిగింది. ఈ విషయాన్ని తొందరగానే గ్రహించిన స్టార్ హీరోయిన్లు అటు వైపు అడుగులు వేశారు. కాజల్, తమన్నా, సమంత వంటి వారు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ఆల్రెడీ క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టారు.
అయితే టాలీవుడ్ హీరోలు ఇంకా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఓ రకంగా చిరు, వెంకీ లు డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నారు అని వినికిడి. ఇలాంటి సాహసాలకు నాగార్జున పెట్టింది పేరు. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈసారి కూడా ఆయనే మొదటి అడుగు వేయబోతున్నట్టు సమాచారం. డిజిటల్ ఎంట్రీ కోసం నాగ్ ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ఎంపిక చేసుకున్నారు.
ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు నాగ్. అది పూర్తయిన తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’లో కూడా ఆయన నటించబోతున్నట్టు తెలుస్తుంది.