తన కొడుకు,కోడలి నిర్ణయంతో అప్సెట్ అయిన నాగార్జున…!

అక్కినేని నాగార్జున … ఇండస్ట్రీలో ఇప్పటికీ ‘కింగ్’ లానే రాణిస్తున్నారు. ‘మన్మధుడు2’ తరువాత నాగార్జున నుండీ మరో సినిమా రాలేదు. ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రాన్ని మొదలు పెట్టినా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇంట్లోనే తన కుటుంబంతో సమయం గడుపుతున్న నాగార్జున … తన పెద్ద కొడుకు, కోడలి వల్ల ఓ విషయంలో హర్ట్ అయ్యాడట. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య, సమంత ఇద్దరూ వరుస సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు.

గతేడాది ఇద్దరూ కలిసి ‘మజిలీ’ చిత్రం చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. సమంత నటించిన ‘ఓ బేబీ’ చిత్రంలో కూడా నాగ చైతన్య గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇదిలా ఉండగా… వీళ్ళిద్దరికీ పెళ్ళై రెండేళ్ళు దాటిన నేపధ్యంలో సమంత ప్రెగ్నెంట్ అంటూ అనేక కథనాలు పుట్టుకొస్తుతున్నాయి. అయితే గతంలో ఈ వార్తల పై సమంత క్లారిటీ ఇచ్చింది. ‘నాకు కూడా పిల్లలు అంటే ఇష్టం. తల్లిని కావాలి అనే కోరిక నాకూ ఉంది.

ఒకవేళ అలాంటి విశేషం ఉంటే… నేను కొన్నాళ్ళు సినిమాలకు, సోషల్ మీడియా కు దూరంగా ఉంటాను అని తెలిపింది. అంతేకాదు చైతో కలిసి ఓ నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మిస్తాను అని కూడా తెలిపింది. అయితే ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయట. ‘ఏ.ఎన్. ఎస్'(A N S) అనే నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నారట. అయితే ఈ విషయంలో నాగార్జున అప్సెట్ అయ్యారట. ఆల్రెడీ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ ఉండగా మరో బ్యానర్ ఎందుకు అని వారితో చెబుతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus