‘హలో బ్రదర్’ (Hello Brother) సినిమా చాలా మందికి హాట్ ఫేవరెట్. ఈ సినిమాని రీ- రిలీజ్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ్ (K.L.Narayana) , ఎస్.గోపాల్ రెడ్డి (S. Gopal Reddy) నిర్మించారు. ఈ సినిమాలో డబుల్ రోల్లో నాగార్జున (Nagarjuna) అదరగొట్టారు. 20 ఏప్రిల్ 1994 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికీ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. నిన్నటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 31 ఏళ్ళు పూర్తయ్యింది.
అయితే ఈ సినిమా గురించి చాలా మందికి తెలీని ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. విషయంలోకి వెళితే.. ఈ సినిమాని ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నారట. అది మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). అవును ముందుగా ‘హలో బ్రదర్’ కథ చిరంజీవి వద్దకే వెళ్ళిందట. ఇద్దరు కవలలు పుట్టడం.. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు సెపరేట్ అవ్వడం, చివర్లో కలవడం వంటివి చాలా సినిమాల్లో చూసినవే కదా.. అని చిరు చెప్పారట. అంతేకాకుండా ‘నేనే ఇలాంటి కథలు చాలా చేశాను కదా’ అని చెప్పి చిరు సున్నితంగా ఈ కథని తిరస్కరించారట.
తర్వాత నాగార్జున వద్దకి ఈ కథ వెళ్ళింది. అయితే ఈ కథలో ట్విన్స్ కి ‘రిఫ్లెక్షన్ మెంటాలిటీ’ అనే డిజార్డర్ ఉంటుంది. దానిని కరెక్ట్ గా డెవలప్ చేసుకుని రమ్మని ఈవీవీతో నాగ్ చెప్పారట. తర్వాత ఈవీవీ.. నాగ్ చెప్పిన మార్పులు చేసుకురావడంతో.. ప్రాజెక్టు సెట్ అయినట్టు స్పష్టమవుతుంది. ఈ సినిమాతో నాగార్జునని మాస్ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత నాగార్జునని వెతుక్కుంటూ అనేక మాస్ కథలు తెచ్చారు దర్శకనిర్మాతలు.