కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన ‘వైల్డ్ డాగ్’ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటిటిలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి నిర్మించారు.ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఆఫీసర్, ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు క్రిటిక్స్ ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు.
ఇక 3 రోజుల క్రితం ఈ చిత్రం ఓటిటిలో విడుదల అయ్యింది. తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ‘వైల్డ్ డాగ్’ కు సంబంధించిన అన్ని వెర్షన్లకు మంచి స్పందన లభిస్తుంది. తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతుండడం మరో విశేషం. ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిన నెట్ -ఫ్లిక్స్ వారికి భారీ లాభాలు దక్కినట్టు ఇన్సైడ్ టాక్. ఇక మరో పక్క ‘ఆహా’ ఓటీటీ లో విడుదలైన ‘చావు కబురు చల్లగా’ సినిమాకి కూడా మంచి స్పందన లభిస్తోంది.
ఈ చిత్రం కూడా థియేటర్లలో ప్లాప్ అయ్యింది.అయితే ఇక్కడ మాత్రం ఇప్పటికే 100 మిలియన్లకు పైగా వ్యూయర్ షిప్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు.దానిని బట్టి ఈ సినిమా కూడా ఓటిటిలో హిట్ అయినట్టే..! దీనిని బట్టి చూస్తుంటే మళ్ళీ ఓటిటిల సందడి మొదలైందని స్పష్టమవుతుంది.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!