తాత పేరుతో నాగచైతన్య ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. నాగచైతన్య నుండి ఈ సినిమా విషయంలో ఎలాంటి సమాచారం లేనప్పటికీ… దర్శకుడు పరశురాం అయితే త్వరలో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని ‘సర్కారు వారి పాట’ ప్రచారం సమయంలో వెల్లడించారు. ఆ తర్వాత ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆలస్యం, లేదు అంటూ ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో మాట వినిపిస్తోంది. అదే ఈ సినిమా మల్టీస్టారర్ అని.
‘సర్కారు వారి పాట’ సినిమాకు ముందే నాగచైతన్య, పరశురాం కలసి ఓ సినిమా చేయాల్సింది. ఆ సినిమాకు ‘నాగేశ్వరరావు’ అనే పేరు కూడా పెట్టారు అని వార్తలొచ్చాయి. అయితే నాగచైతన్య వేరే ప్రాజెక్ట్‌లో ఉండటం, అటు మహేష్ సినిమా ఓకే అవ్వడంతో పరశురాం అటెళ్లిపోయారు. కరోనా, ఇతర పరిస్థితుల వల్ల ఆ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఆఖరి విడుదలైంది. ఫలితం లెక్కలు పక్కనపెడితే.. చైతన్య సినిమాకు వేళైంది. కానీ ఇప్పుడు చైతన్య ఇప్పుడు వేరే సినిమా చేస్తారు.
దీంతో దర్శకుడు పరశురాం ఈ సినిమా కథ మీద మరోసారి కూర్చున్నారు అని చెబుతున్నారు. ఈ క్రమంలో సినిమాను మల్టీస్టారర్‌గా మారిస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారట. రెండో హీరోగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టిని తీసుకుందామని ఆలోచన చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా సాగితే నాగచైతన్య – నవీన్ కలసి ‘నాగేశ్వరరావు’లో కనిపిస్తారని టాక్. మరి దీనికి ఇద్దరూ అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఓకే అయితే కుర్ర హీరోల మల్టీస్టారర్ ఆలోచన అదిరిపోతుంది.
అయితే ఇప్పుడు నాగచైతన్యను చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే ‘నాగేశ్వరరావు’ ఇప్పట్లో మొదలయయేలా లేదు. ‘థ్యాంక్ యూ’ సినిమా తర్వాత పరశురామ్‌కి డేట్స్ ఇస్తా అని చెప్పిన చైతు… ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదట. మరోవైపు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాకు ఓకే చెప్పేశాడు చైతు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం అని అంటున్నారు. ఆ లెక్కన ‘సర్కారు…’ కోసం పరశురామ్ చూపించిన యాక్షన్‌కు ఇది రియాక్షన్ అని చెబుతున్నారు.
వెంకట్ ప్రభు సినిమా ఇటీవల ముహూర్తం జరుపుకుంది. కథ పూర్తిగా సిద్ధంగా ఉండటంతో ఈ సినిమా చేసి, ఆ తర్వాత పరశురామ్ సినిమా చేద్దామని అనుకుంటున్నారట నాగచైతన్య. అయితే ఇది ముందస్తు నిర్ణయం ప్రకారమే జరిగింది అని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.