కమల్ తో నగ్మ భేటీ…సర్వత్రా చర్చ!

ఒకప్పుడు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ తన అందాలతో, అభినయంతో ఒక ఊపు ఊపిన హీరోయిన్ నగ్మా గుర్తు ఉందా? ఎలా మార్చిపోతాంలే…ఆమె అందించిన సోయగాల అందాలు అంత ఈజీగా మరచిపోయేవా…మాస్ లో మంచి పట్టు ఉన్న నగ్మా కాలక్రమేణా సినిమాలకు గుడ్ బై చెప్పేసి, మెల్లగా పొలిటికల్ లైఫ్ కి టర్న్ అయిపోయింది. ఆ మధ్య అరా కొరా అత్త, అమ్మ పాత్రలు చేసినప్పటికీ పెద్దగా కలసి రాలేదు ఆమెకు. ఇదిలా ఉంటే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఉన్న నగ్మా సడన్ గా ఈ మధ్య తమిళ టాప్ హీరోలను కలుస్తూ, మర్యాద పూర్వకంగా, అసలు రాజకీయమే లేదంటూ షాక్స్ ఇస్తుంది…ఇంతకీ అసలు విషయంలోకి వెళితే, అలనాటి టాప్ హీరోయిన్ నగ్మా తాజాగా విశ్వానటుడు కమల్ హసన్ ను కలిసింది.

అయితే అసలే తమిళ రాజకీయాలు మంచి రసవత్తరంగా ఉన్న వేళ, అటు రజని, ఇటు కమల్ ఇద్దరూ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలు చేస్తున్న వేళ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అయిన నగ్మా ఇలా భేటీ కావడం సర్వత్రా చర్చకు దారితీసింది. తమిళ మీడియా అయితే ఈ విషయంపై కోడై కూస్తుంది. తాజాగా కమల్ తో భేటీ అయ్యిన నగ్మా…ఆ మధ్య మే నెలలో తమిళ తలైవార్ రజనీకాంత్ తో కూడా భేటీ అయ్యీ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. మొత్తంగా ఈ కధ అంతా చూసిన తరువాత మేము ఎలాంటి రాజకీయ చర్చల కోసం భేటీ కాలేదు కేవలం నటులమనే ఫ్రెండ్లీ దృక్పధంతో వాళ్ళను కలిశాను అన్న నగ్మా స్టేట్మెంట్ విన్న తరువాత ఏదో జరుగుతుంది అని, ఇలా వరుస భేటీలతో నగ్మా ఏదో ప్లాన్ చేస్తోందని తమిళ తంబీలు తెగ గుస గుసలాడుకుంటున్నారు. మరి ఈ భేటీలకీ సమాధానం కావాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus