ఇప్పుడంటే సరైన డైట్ మెయింటైన్ చేయక లావైపోయి భారీగా తయారయ్యింది కానీ.. “సొంతం, జెమిని” లాంటి చిత్రాల్లో నమితను చూసి ఆమెకు అభిమానులుగా మారని యువత లేరంటే అతిశయోక్తేమీ కాదు. అలాంటి హాట్ ఫేవరెట్ నమిత.. కొన్నాళ్ళకు సెకండ్ హీరోయిన్స్ రోల్స్ కి ఫిక్స్ అయిపోయి భారీగా బరువు పెరిగి అనంతరం సెక్సీ ఇమేజ్ సొంతం చేసుకొని కొన్నాళ్లపాటు తెలుగు-తమిళ-మలయాళ చిత్రాల్లో ఆ తరహా పాత్రలు పోషించి ఇటీవల తాను ప్రేమించిన యువకుడ్ని పెళ్లాడి సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఆమెకు పెళ్ళయి సరిగ్గా 6 నెలలు కూడా అవ్వలేదనుకోండి. ఈలోపే మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీకి రెడీ అంటోంది నమిత.
అయితే.. ఇదివరకట్లా చిట్టిపొట్టి దుస్తుల్లో కాకుండా కాస్త చీరలు కట్టే పాత్రలు మాత్రమే చేస్తానంటోంది. ఇంకో చిన్న రూల్ కూడా పెట్టిందండోయ్. అదేంటంటే.. పెళ్ళైన తర్వాత కూడా ఎక్స్ పోజింగ్ చేయడానికి తనకు పెద్దగా ఇబ్బందేమీ లేదని చెబుతూనే.. ఆ అందాల ప్రదర్శన అనేది కథా గమనానికి అవసరమైతే ఒకే కానీ.. లేదంటే మాత్రం అస్సలు చేయనని షరతులు విధిస్తోంది. మరి నమిత రీఎంట్రీకి ఏ దర్శకనిర్మాత సహకరిస్తాడో చూడాలి.