శ్రీవారి సేవలో.. శ్రీమంతుడి సతీమణి

సెలబ్రిటీలు ఆచార వ్యవహారాలను అంతగా పట్టించుకోరు అన్న అపవాదు ఉంది. అయితే అది అందరి విషయంలో కాదన్నది గుర్తెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. “శ్రీవారి సేవలో ప్రముఖులు” అని నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. పోతే.. నిన్న తిరుమలలో నమ్రత దర్శనమివ్వడంతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటంబం ఇటువంటి విషయాల్లో శ్రద్ధ వహిస్తున్నారని తేట తెల్లమైంది.

మహేశ్ బాబు సతీమణి నమ్రత పిల్లలు గౌతమ్, సితారలతో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా నమ్రత వేంకటేశ్వరునికి ఎంతో ఇష్టమని చెప్పుకునే తలనీలాలను భక్తితో సమర్పించారు. ఎంతోమంది తారలు తిరుమల వెళ్లిరావడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇలా తలనీలాలు సమర్పించడం అన్నది ఈ మధ్య కాలంలో చూసింది లేదు. ఇటీవల వినాయక నిమజ్జన వేడుకల్లో గౌతమ్ పాల్గొనడం, ఇప్పుడు నమ్రత తలనీలాలు సమ్పరించడం ఆ కుటంబంపై మరింత గౌరవాన్ని పెంచాయి. మహేశ్ కుటుంబంతో పాటు దర్శకుడు మెహర్ రమేష్ ఉండటం విశేషం. ఇటీవల ఆయన మహేశ్ తో ఓ ప్రచార చిత్రాన్ని రూపొందించిన సంగతి తెల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus