Namrata: మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ అందరికీ సుపరిచితమే. ముంబైకి చెందిన ఈమె కెరీర్ ప్రారంభంలో పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. చిరంజీవి – కోడి రామకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అంజి’ చిత్రంతో టాలీవుడ్ కు అడుగుపెట్టింది. కానీ ఆమె రెండో సినిమా ‘వంశీ’ మొదట రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తర్వాత ఈమె టాలీవుడ్ వైపు చూడలేదు. అయితే అనూహ్యంగా ఒక రోజు ఈమె మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నట్టు ప్రకటన వచ్చింది.

ఆ టైంలో మహేష్ బాబు అభిమానులతో పాటు టాలీవుడ్ అంతా ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఈ జంటకు ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా ఈమెను పెళ్లాడిన తర్వాతే మహేష్ బాబు దశ కూడా తిరిగింది. తిరుగులేని స్టార్ డం అతని సొంతమైంది. పెళ్ళైన తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. మరోపక్క మహేష్ కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా నమ్రత చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.తన పిల్లలు, మహేష్ కు సంబంధించిన కొత్త ఫోటోలను ఈమె షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ హాట్ టాపిక్ అయ్యింది. ఈరోజు నమ్రత తండ్రి నితిన్ శిరోద్కర్ చనిపోయిన రోజు కావడంతో ఆమె ఈ పోస్ట్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ’16 సంవత్సరాలుగా నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను పప్పా.! ఏమి మారలేదు.

నీ ప్రతి జ్ఞాపకం నా మదిలో అలానే భద్రంగా ఉంది. ఆ జ్ఞాపకాలు నుండి నేను బయటకు రాలేకపోతున్నాను. కానీ నువ్వు మమ్మల్ని త్వరగా వదిలి వెళ్ళిపోయావు. అనంతమైన ప్రేమను, ఆప్యాయతను ఎల్లప్పుడూ నీపై కనబరుస్తూనే ఉంటాను’ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది నమ్రత. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus