సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా (SSMB29) తెరకెక్కుతుంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) , ప్రియాంక చోప్రా(Priyanka Chopra)..లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు రాజమౌళి. అలాగే ఒక పాటను కూడా చిత్రీకరించారు అని తెలుస్తుంది. ఇప్పుడు టీంకి కొంత బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. కొద్దిరోజుల్లో నెక్స్ట్ షెడ్యూల్ ను మొదలుపెడతాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కూడా ఎంపికైనట్టు ప్రచారం జరిగింది.
కానీ దానిపై ఎటువంటి క్లారిటీ వచ్చింది లేదు. మరోపక్క ఇప్పుడు సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల కోసం స్టార్స్ ను తీసుకునే పనిలో పడ్డాడట రాజమౌళి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రి పాత్ర ఒకటి ఉందట. సినిమాలో (SSMB29) అది అత్యంత కీలకమైనది అని తెలుస్తుంది. దీని కోసం కచ్చితంగా స్టార్ ని తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నాడట.
దీని కోసం బాలీవుడ్ స్టార్ నానా- పాటేకర్ (Nana Patekar)..ను సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం అతనికి ఏకంగా రూ.20 కోట్లు ఆఫర్ చేశారట. నానా పాటేకర్ 18 రోజుల పాటు డేట్స్ ఇవ్వాల్సి ఉందట. అంటే రోజుకు కోటికి పైనే పారితోషికం అని చెప్పాలి. అయినప్పటికీ నానా పాటేకర్ టెంప్ట్ అవ్వకుండా ఈ ఆఫర్ ను వద్దనుకున్నట్టు తెలుస్తుంది.
తనకు కమర్షియల్ గా రోల్స్ కి కనెక్ట్ అవ్వడం నచ్చదని.. మనసుకు నచ్చిన పాత్రలు చేయాలని ఉందని.. తెలిపినట్టు స్పష్టమవుతుంది. దీంతో ‘తండ్రి పాత్ర కోసం రూ.20 ఆఫర్ చేయడం, దాన్ని వదులుకోవడం చాలా టూ మచ్ గా ఉందని’ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.