Balakrishna: ఆ ట్రోల్స్ పై నందమూరి ఫ్యాన్స్ ఫైర్.. ఏం జరిగిందంటే?

  • February 6, 2023 / 12:23 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోగా ఈ మధ్య కాలంలో ఆయన ఏం మాట్లాడినా వివాదం అవుతోంది. కొన్నిరోజుల క్రితం బాలయ్య అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్లు చేయగా అక్కినేని హీరోలు ఒకింత సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలయ్య అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ఆప్యాయత లేదంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

అన్ స్టాపబుల్ షోలో బాలయ్య నర్సుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ మాట్లాడుతూ బాలయ్య నర్సులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని అన్నారు. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లపై మండిపడుతున్నారు. ప్రతిదీ వివాదం చేయడం సరికాదని వాళ్లు చెబుతున్నారు. బాలయ్య మంచి వ్యక్తి అని సరదాగా తన జీవితంలో జరిగిన సన్నివేశాల గురించి చెప్పారని

ప్రతిదీ నెగిటివ్ గా తీసుకోవద్దని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్యపై రాజకీయ పరమైన కారణాలతో వివాదాలు సృష్టిస్తున్నారని బాలయ్య ఫ్యాన్స్ చెబుతున్నారు. తప్పు చేస్తే బాలయ్య క్షమాపణ చెబుతారని అంత మాత్రాన బాలయ్య చేసిన ప్రతి పని తప్పే అని చెబితే ఊరుకోమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బాలకృష్ణ గురించి ప్రజలకు కూడా తెలుసని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఈ మధ్య కాలంలో బాలయ్యను కొంతమంది కావాలనే టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. బాలయ్య తనపై విమర్శలు చేసేవాళ్లకు త్వరలో గట్టిగా జవాబిస్తారని బాలయ్యపై నెగిటివిటీ పెరిగేలా ప్రచారం చేయొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. బాలయ్యకు ఇతర భాషల్లో కూడా మార్కెట్ పెరుగుతుండటం గమనార్హం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus