Balakrishna: నా పేరు బాలకృష్ణ… మా ఇంటిపేరు నందమూరి.. ఏం ఫీల్‌ ఉంది మామా ఇంటర్వ్యూలో..!

బాలకృష్ణను  (Nandamuri Balakrishna)  భోళా శంకరుడు అని, బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం అని, బాల మనసులో కల్మశం లేదు అని అంటుంటారు తెలుగు సినిమా పరిశ్రమలో. ఎందుకు, ఏంటి అనేది చాలా దగ్గరివాళ్లకు తెలుస్తుంది. తాజాగా ఆయన నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించి పరిచయం చేసుకోవడం, మాట్లాడటం విన్నాక ‘ఏం ఫీల్‌ ఉంది మామా ఇంటర్వ్యూలో’ అని కచ్చితంగా అనిపిస్తుంది. దాంతోపాటు ఆయన అభిమానులకు ఎంత దగ్గరగా ఉంటారు అనే విషయం కూడా తెలుస్తుంది.

Balakrishna

నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆ పురస్కారాన్ని బహూకరించారు. అనంతరం బాలయ్య అక్కడ ఉన్న ఇంగ్లిష్‌ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన నా పేరు బాలకృష్ణ.. నేను ఎన్టీఆర్ కుమారుడిని.. మా ఇంటి పేరు నందమూరి అంటూ పరిచయం చేసుకున్నారు. ఆయన టాలీవుడ్‌ స్టార్‌ హీరోనే అయినప్పటికీ, ఎమ్మెల్యేనే అయినప్పటికీ నేషనల్‌ మీడియాలో పెద్దగా పరిచయం లేదు. అందుకే అలా గౌరవంగా తనను తాను పరిచయం చేసుకున్నారు.

ఇంటర్వ్యూలో బాలయ్య హిందీలో చాలా బగా మాట్లాడారు. రీసెంట్‌గా తాను చేసిన సినిమాల గురించి, హిందూపురం ఎమ్మెల్యేగా చేసిన సేవల గురించి, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి హెడ్‌గా చేసిన సేవల గురించి వివరంగా చెప్పుకొచ్చారు బాలయ్య. తెలుగు చిత్ర సీమలో తనది 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం అని చెప్పిన బాలకృష్ణ… త్వరలో ఓ హిందీ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా ఏంటి అనేది మాత్రం చెప్పలేదు.

ఇక తనకు చాలా అభిమాన సంఘాలు ఉన్నాయని, రిజిస్టర్డ్ ఫ్యాన్స్ తనకు ఉన్నట్టు మరొక హీరోకు లేరు అని తన గురించి గొప్పగా చెప్పుకొచ్చారు బాలయ్య. అంతేకాదు కొంతమంది అభిమానుల ఫోన్ నంబర్స్ తన దగ్గర ఉన్నాయని, వాళ్లతో అప్పుడప్పుడూ మాట్లాడతానని చెప్పాడు.

హీరోయినే విలనా.. ‘హిట్ 3’ ఎలా ఉండబోతుంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus