నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 3′(హిట్ : ది థర్డ్ కేస్) (HIT 3) . ఈ సినిమాని ‘వాల్ పోస్టర్ సినిమా’ మరియు ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ సంస్థలపై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కె.జి.ఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఈ చిత్రంలో నానికి జోడీగా నటించింది. గ్లింప్స్, టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై హైప్ పెంచాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎస్.ఎస్.ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) గెస్ట్ గా వచ్చి ప్రమోట్ చేయడంతో సినిమాకు మరింత మైలేజ్ చేకూరింది. అంచనాలు కూడా అమాంతం పెరిగాయి. దీంతో మే 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని నాని ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితులకి స్పెషల్ షో వేసి చూపించడం జరిగింది. సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని వారు షేర్ చేసుకున్నారు.
వారి టాక్ ప్రకారం… సినిమా 2 గంటల 38 నిమిషాల నిడివి కలిగి ఉందట. ఫస్ట్ హాఫ్ లో 15 నిమిషాల వరకు ఒక సీరియస్ ప్లాట్ నడుస్తుందట. ఆ తర్వాత అర్జున్ సర్కార్ గా నాని ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. అది మాస్ ఆడియన్స్ ని కూడా అలరించే విధంగా ఉంటుందట. తర్వాత సీరియస్ కిల్లింగ్స్ జరుగుతుండటం. విలన్ ఒక్కరా, ఇద్దరా? అనే కన్ఫ్యూజన్ కలిగిస్తూ సినిమా సాగుతుందట. ఇంటర్వెల్ కి ఒక ఊహించని ప్లాట్ డిజైన్ చేశారట. అది షాకిస్తుంది అని అంటున్నారు.
మధ్యలో నాని, శ్రీనిధి శెట్టి..ల లవ్ ట్రాక్ యూత్ ని ఆకట్టుకుంటుందట. క్లైమాక్స్ లో ఆమెనే విలన్ అనే విధంగా డైవర్ట్ చేసిన విధానం థ్రిల్ చేస్తుందని అంటున్నారు. అడివి శేష్ (Adivi Sesh) కూడా ఈ సినిమాలో చిన్న అతిథి పాత్ర చేశాడట. ఫస్ట్ పార్ట్ హీరో అయిన విశ్వక్ సేన్ (Vishwak Sen) విజువల్స్ కూడా అక్కడక్కడా చూపిస్తారట. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మొత్తం రక్తపాతంతో నిండి ఉంటుంది అంటున్నారు. అలాగే హిట్ 4 హీరో ఎంట్రీ కూడా ఉంటుందట. అది ఆల్రెడీ చాలా మందికి తెలిసిపోయింది కాబట్టి.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.