Balakrishna: చరిత్ర తిరగరాస్తున్న బాలయ్య.. సీమలో ఈ హీరోకు పోటీ లేదుగా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. బాలయ్య సినిమాలలో డైలాగ్స్, యాక్షన్ సీన్లు స్పెషల్ గా ఉంటాయి. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ సినిమాలు సైతం థియేటర్లలో 50 రోజులు ఆడటం గగనమవుతుండగా బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మాత్రం కర్నూలులోని ఆలూరులో ఉన్న ఒక థియేటర్ లో ఏకంగా 200 రోజులు ఆడింది.

బాలయ్య సినిమా ప్రస్తుత కాలంలో ఏకంగా 200 రోజుల పాటు ప్రదర్శించబడి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆలూరులోని ఎస్ఎల్ఎన్ఎస్ థియేట‌ర్‌లో ఈ సినిమా 200 రోజుల పాటు మంచి ఆక్యుపెన్సీతో ప్రదర్శితమైంది. గత ఆరు నెలల్లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలైనా ఏ సినిమా కూడా వీరసింహారెడ్డిని ఈ థియేటర్ లో రీప్లేస్ చేయలేదు.

బాలయ్య సినిమాల్లు గతంలో 1000 కంటే ఎక్కువ రోజులు ప్రదర్శించడిన సందర్భాలు సైతం ఉన్నాయి. బాలయ్యకు సీడెడ్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య సినిమాలలో చాలా సినిమాలకు సీడెడ్ లో రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. బాలయ్య రెగ్యులర్ కథలకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సక్సెస్ లను అందుకుంటున్నారు.

బాలయ్య (Balakrishna) పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడితే ఇతర భాషల్లో కూడా బాలయ్య సినిమాలు భారీగా కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య వీరసింహారెడ్డి మూవీ సాధించిన రికార్డ్ అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. స్టార్ హీరో బాలకృష్ణ తర్వాత సినిమాలు సైతం భారీగా సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉన్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus