రోడ్డు ప్రమాదాలతో కలవరపడుతున్న నందమూరి అభిమానులు

రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. ఒక కుటుంబంలో ఒకసారి ప్రమాదం జరిగితే కోలుకోవడం కష్టం. అటువంటిది నందమూరి కుటుంబంసభ్యులు మూడు సార్లు రోడ్డు ప్రమాదాలను ఎదుర్కొన్నారు. అదికూడా ఒకే జిల్లాలో ప్రమాదాలు జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నాలుగేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి చెందారు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం ట్రాక్టర్‌ను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదం లో ఆయన అక్కడిక్కడే మరణించారు.

అంతకు ముందు 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా మోతే వద్ద ఆయన ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. దేవుడి దయ వల్ల ఎన్టీఆర్ గాయాలతో బయటపడ్డాడు. ఈరోజు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కన్నీటి సంద్రంలో ముంచుతోంది. దీంతో నందమూరి కుటుంబాన్ని వరుస రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus