హరికృష్ణ పాత్రను ఎవరు పోషిస్తున్నారో తెలుసా ?

మనం ఎంతగానో ఆరాధించే వ్యక్తి గురించి పదిమందికి చెప్పమంటే ఎలా ఫీలవుతామో.. ఎలా చెప్పాలనుకుంటామో.. అలాంటి పరిస్థితిలోనే డైరక్టర్ క్రిష్ ఉన్నారు. మహానటుడు నందమూరి తారకరామారావు సినిమాలు చూస్తూ క్రిష్ పెరిగారు. అతను సినిమా వారికి మాత్రమే కాకుండా.. నేతగా ఎదగాలనేవారికి సైతం స్ఫూర్తిగా నిలిచారు. అంతటి గొప్ప వ్యక్తి గురించి సినిమా చేయడం మామూలు విషయం కాదు. అందుకే ఎంతో శ్రద్ధగా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న ఇందులో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రని బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పోషిస్తోంది. అక్కినేని నాగేశ్వరరావ్ పాత్రలో సుమంత్, ఎన్టీఆర్ అల్లుడు, నేటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గా దగ్గుబాటి రానా అదరగొట్టనున్నారు.

అలాగే యువ బాలకృష్ణగా మోక్షజ్ఞ కనిపించనున్నారు. ఇప్పటికే అనేకమంది హీరోలతో నిండిపోతున్న ఈ మూవీకి మరో ప్రధాన బలం తోడుకానుంది. ఆ బలమే కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్న సమయంలో హరికృష్ణ పాలిటిక్స్ లో క్రియాశీలకంగా ఉన్నారు. అందుకే బయోపిక్ లో హరికృష్ణ పాత్ర చాలా కీలకం కానుంది. హరికృష్ణ పాత్రకు కళ్యాణ్ రామ్ సరిగా సూట్ అవుతారని క్రిష్ భావించి సెలక్ట్ చేసుకున్నారు. ఇలా రోజురోజుకి బయోపిక్ చాలా గ్రాండ్ గా మారిపోతోంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus