‘118’ రిలీజ్ డేట్ విషయంలో తొందరపడుతున్న కళ్యాణ్ రామ్

2018 లో రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. అందులో ఒకటి ‘ఎం.ఎల్.ఏ’ చిత్రం కాగా.. రెండోది ‘నా నువ్వే’. వీటిలో ‘ఎం.ఎల్.ఏ’ చిత్రం యావరేజ్ గా నిలిచినప్పటికీ.. ‘నా నువ్వే’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఎప్పుడూ విభిన్న చిత్రాలు చేయడంలో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటాడనడంలో సందేహంలేదు. గతంలో చేసిన ‘హరే రామ్’ ‘ఓం త్రీడి’ చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే అవి విఫలమవడంతో మళ్ళీ కమర్షియల్ చిత్రాలనే ఎంచుకున్నాడు.

ఇప్పుడు మరో మారు అదే కోవలో మరో చిత్రాన్ని ఎంచుకున్నాడు. టాలీవుడ్ లో ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన గుహన్ ను దర్శకుడిగా చేస్తూ కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘118 ‘. ఈ చిత్రం కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడుతున్నాడట. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రంలో నివేద థామస్ , షాలిని పాండే లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలోనే దింపాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే ‘వినయ విధేయ రామా’ ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ ‘ఎఫ్2’ వంటి క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందులోనూ ‘ఎన్టీఆర్’ లో కూడా కళ్యాణ్ రామ్ ఓ కీలక పాత్రపోషించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి పోటీ ఎందుకని ‘పెట్టా’ వంటి క్రేజీ చిత్రాన్నే తెలుగులో వాయిదా వేస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ చిత్రానికి థియేటర్స్ ఎలా దొరుకుతాయంటూ ఫిలింనగర్లో చర్చించుకుంటున్నారు. మరి చివరికి ఏంచేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus