Jr NTR, Mokshagna: జూనియర్ ఎన్టీఆర్ ని తలపిస్తున్న మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్.!

నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క సినిమా కూడా చేయకుండానే మోక్షజ్ఞకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. అతని పేరు పై చాలా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. అలాగే మోక్షజ్ఞ ప్రతి పుట్టినరోజు నాడు నందమూరి అభిమానులు స్వయంగా బాలయ్య ఇంటికి వెళ్లి మరీ మోక్షజ్ఞతో కేక్ కట్ చేయించి బర్త్ డే ని సెలబ్రేట్ చేసి వస్తున్నారు.

ఆ సెలబ్రేషన్ కి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా.. నందమూరి మోక్షజ్ఞ సినీ రంగప్రవేశానికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ‘వస్తున్నా’ అంటూ మోక్షజ్ఞ ట్విట్టర్ ఫ్యాన్ పేజ్ లో అతని లేటెస్ట్ పిక్ తో ఓ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ ఫొటోలో మోక్షజ్ఞ అచ్చం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  లానే ఉన్నాడు.

ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్ తో.. మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్ ను పోల్చి కొన్ని మీమ్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ‘అన్న లెక్కే తమ్ముడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. బాలయ్యకి ప్రశాంత్ వర్మపై నమ్మకం ఎక్కువే. ‘ఆదిత్య 369 ‘ సీక్వెల్ తో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందన్నట్టు గతంలో బాలయ్య చెప్పుకొచ్చాడు. బహుశా ఆ కథతోనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందేమో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus