నందమూరి తారకరత్నకి చాలా పెద్ద గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. నిన్న మొన్నటివరకు అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.అయితే నిన్న మధ్యాహ్నానికి పరిస్థితి కాస్త కుదుటపడింది అని బాలయ్య చెప్పారు.గుండె చప్పుడు మెరుగైందని… ఇది ఒక అద్భుతమని బాలయ్య తెలిపారు. కుప్పంలో యాంజియోప్లాస్టి తర్వాత నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చేరిన తారకరత్నకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
అయితే తారకరత్న గుండె స్థితి సాధారణ స్థాయికి చేరుకున్నా.. మెదడు పనితీరు మెరుగవ్వాల్సి ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్, తెలిపారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోయిన కారణంగా..మెదడు పనితీరు దెబ్బతిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని నందమూరి రామకృష్ణ చెప్పుకొచ్చారు. ‘తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవయవాల పనితీరు కూడా బాగానే ఉంది.
ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్ పై ఉన్నారు.న్యూరాలజిస్ట్ అబ్జర్వేషన్లో ఉన్నారు. ఎక్మో పెట్టలేదు. ఎక్మో పెట్టారు అనే వార్తల్లో నిజం లేదు..! మరికాసేపట్లో తారకరత్న హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేస్తారు’ అంటూ ఆయన తెలిపారు. నందమూరి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్నకు కుప్పంలో గుండెపోటు వచ్చింది.ఆ టైంలో ఆయన్ని కుప్పంలో ఉన్న కేసి ఆసుపత్రికి తరలించారు.