Nandi Awards: నంది అవార్డులపై చర్చకు దారి తీసిన నిర్మాతలు, పోసాని వరుస కామెంట్లు.. ఏమైందంటే?

  • May 2, 2023 / 07:02 PM IST

నంది అవార్డులు.. తెలుగు నాట ఇవి చాలా గొప్ప పురస్కారాలు. తెలుగు నాట ఏటా ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ నటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం పురస్కారాలు ఇచ్చేవారు. 2016 వరకు ఏటా జరిగిన ఈ పురస్కరాలు (అప్పుడప్పుడు రెండేళ్లకొకసారి ఇచ్చేవారు అనుకోండి) ఆ తర్వాత ఆగిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు అంటే ఏడేళ్ల తర్వాత దీనిపై చర్చ జరుగుతోంది. చర్చ అనే కంటే మాటల మంటలు అని చెప్పొచ్చు.

ఓ సినిమా రీ రిలీజ్‌ వేడుక వేదికగా సీనియర్‌ నిర్మాతలు కొన్ని కామెంట్లు చేస్తే.. సీనియర్‌ నటుడు తర్వాత వాటిపై స్పందించారు. (Nandi Awards) నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి రెండు తెలుగు ప్రభుత్వాలకు లేకుండా పోయిందంటూ సీనియర్‌ నిర్మాత ఆదిశేషగిరి రావు కామెంట్స్‌ చేశారు. ప్రభుత్వ అవార్డుకు ఒకప్పుడు విలువ ఉండేదని, ఇప్పుడు ఆ విలువ లేకుండా పోయిందని అభిప్రాయ పడ్డారాయన. పురస్కారాల విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువైందని కూడా విమర్శించారు ఆయన.

నిర్మాత అశ్వనీదత్‌ అయితే ఇంకాస్త ఘాటుగా స్పందించారు. ‘‘ప్రస్తుతం నడుస్తున్న సీజన్‌ వేరు. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ లాంటి పురస్కారాలు ఇస్తారు. సినిమాలకు అవార్డులు ఇచ్చే రోజులు లేవు’’ అని అన్నారు. అంతేకాదు రెండు మూడేళ్లలో మళ్లీ వస్తాయి అని ఆయన కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలకు పోసాని కృష్ణమురశి స్పందించారు. ‘‘ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అని కాదు కానీ.. మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు అనే అవార్డులు ఇవ్వాలి’’ అని అన్నారు పోసాని.

దీంతో టాలీవుడ్‌లో మళ్లీ ఈ విషయంలో చర్చ మొదలైంది. ఆ మధ్య పోసాని కృష్ణ మురళి, అంబికా కృష్ణ మధ్య కూడా ఇలాంటి చర్చే జరిగింది. ఆఖరికి అంబికా కృష్ణ కామ్‌ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. అసలు విషయం ఏంటంటే.. ఇంత జరిగినా రెండు ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందనా లేదు. అన్నట్లు నంది పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం సింహ అవార్డులుగా మార్చి ఇస్తాం అని చెప్పింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus