Nandini Rai: మోకాళ్ళ పై మెట్లెక్కుతూ మొక్కు తీర్చుకున్న నందినీ రాయ్.. వైరల్ అవుతున్న వీడియో..!

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోజూ లక్షల మంది తిరుమల వెళ్తుంటారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున తిరుమల వెళ్తుంటారు. చాలా వరకు వీళ్ళు విఐపి కేటగిరిలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అలా అయితే రద్దీ ఎక్కువగా ఉండదు, క్యూలో ఎక్కువ సేపు నిలబడాల్సిన పనిలేదు. పైగా దర్శనం కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. అయితే ఓ సెలబ్రిటీ అందులోనూ ఓ హీరోయిన్ తిరుమల మెట్లు మోకాళ్ళ పై ఎక్కుతూ తన మొక్కుబడి తీర్చుకుంది.

ఆమె మరెవరో కాదు ప్రముఖ హీరోయిన్, బిగ్ బాస్ కంటెస్టెంట్, మోడల్ అయిన నందినీ రాయ్. ఎంత బలమైన మొక్కు మొక్కుకుందో, అది ఎంత ఫాస్ట్ గా నెరవేరిందో కానీ ఆ మొక్కుబడి మాత్రం చాలా నిజాయితీగా తీర్చుకుంది అని చెప్పాలి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొంతమంది హీరోయిన్లు పాదరక్షలు లేకుండానే తిరగలేకపోతున్న ఈరోజుల్లో మోకాళ్ళ పై అన్ని మెట్లెక్కి మొక్కుబడి తీర్చుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి.

అందుకే నందినీ రాయ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ‘మాయ’ ‘మోసగాళ్ళకు మోసగాడు’ ‘సిల్లీ ఫెలోస్’ ‘పంచతంత్ర కథలు’ ‘గాలివాన’ వంటి సినిమాల్లో నటించిన ఈమె 2018 లో ‘బిగ్ బాస్ సీజన్ 2’ లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. అయితే ఈ షోలో కౌశల్ పై కొన్ని నెగిటివ్ కామెంట్లు చేసి అతని ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యింది.

కానీ షోలో భాగంగా మాత్రమే కాబట్టి తర్వాత అందరూ మర్చిపోయారు. ఇక ప్రస్తుతం ఈమె అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus