నందిత స్కిన్ షో చేస్తే చూడగలమా..?
- March 30, 2016 / 02:12 PM ISTByFilmy Focus
కొంతమంది కధానాయికలు గ్లామర్ కే పరిమితయ్యి ఆ తరహా పాత్రల్లోనే నటిస్తుంటారు. హీరోయిన్స్ అన్నప్పుడు గ్లామర్ గా కనిపించడం ముఖ్యమని భావిస్తుంటారు. మరికొంత మంది కథానాయికలు మాత్రం సంప్రదాయకంగా ఉండే పాత్రల్లో కనిపించడానికే ఇష్టపడుతుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ నందిత కూడా ఉంది. ‘ప్రేమ కథా చిత్రం’,’లవర్స్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నందిత ప్రస్తుతం నారా రోహిత్ సరసన ‘సావిత్రి’ సినిమాలో నటిస్తుంది.
ఏప్రిల్ 1న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా కెరీర్ ఆరంభంలో అవకాశాలు వచ్చినా, రాకపోయినా స్కిన్ షో కు మాత్రం దూరంగా ఉండాలని నందిత భావించింది. కాని ఇప్పుడు ఆ విషయం తప్పని తెలుసుకొని తను కూడా కాస్త గ్లామర్ డోస్ పెంచుతానని తన సన్నిహితులతో చెబుతుందట. మరి నందిత లాంటి హోమ్లీ అమ్మాయిలు గ్లామర్ పాత్రలో నటిస్తే ప్రేక్షకులు చూడగలరో లేదో..?
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















