Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

స్టార్ సింగర్ గీతా మాధురి భర్త అయినటువంటి నందు.. ఇప్పటికే చాలా సినిమాల్లో సహాయ నటుడిగా నటించాడు.’100 % లవ్’ ‘పెళ్లి చూపులు’ ‘జయ జానకి నాయక’ వంటి ఎన్నో చాలా సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు. హీరోగా కూడా ‘సవారి’ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ వంటి సినిమాలు చేశాడు. అవి వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. ఈ రియాలిటీని అర్థం చేసుకుని టీవీ షోలకు హోస్ట్ గా చేసుకుంటూ వస్తున్నాడు నందు.

Nandu, Avikagor

అయితే హీరోగా నిలబడాలి అనే కోరిక అతనికి ఇంకా తగ్గలేదు అనుకుంట.. హీరోగా మరో సినిమా చేశాడు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా పేరు ‘అగ్లీ స్టోరీ’.తాజాగా ఈ సినిమా టీజర్ వదిలారు. టైటిల్ కి తగ్గట్టే.. చాలా అగ్లీగా అనిపించింది టీజర్. సినిమాలో హీరో ఒక సైకో. అతను హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. చిన్నప్పటి నుండి ఆమెను దక్కించుకోవాలనే కోరిక హీరోలో ఎక్కువగా ఉంటుంది.

అందుకే ఆమె మరో వ్యక్తిని ప్రేమించింది అని తెలియగానే.. ఆ వ్యక్తిపై దాడి చేస్తాడు. తర్వాత హీరోయిన్ ను శారీరకంగా మానసికంగా వేదిస్తాడు. ఈ తరహా కాన్సెప్ట్ తో అల్లరి నరేష్ ‘నేను’ వంటి సినిమాలు వచ్చాయి. ఉపేంద్ర సినిమాల కథలు సగానికి సగం ఇలానే ఉంటాయి. అయితే హీరోని అర్జున్ రెడ్డి స్టైల్లో చూపించారు. నందుకి ఇంత కాలానికి ఒక మంచి పాత్ర దొరికినట్టుంది. అతని ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అని అనలేం కానీ.. ఎందుకో ఈ పాత్రకి అతని ఫేస్ సెట్ అయ్యింది అనిపిస్తుంది. ఇది కనుక హిట్ అయితే నందు కెరీర్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus