రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా మొదలైంది. ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది‘అనార్కలీ’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రాజెక్టు మొదలైంది. కానీ తర్వాత షూటింగ్ అప్డేట్స్ ఏమీ రాలేదు. కొంతమంది ‘మాస్ జాతర’ కోసం రవితేజ ఈ ప్రాజెక్టుకి బ్రేక్ ఇచ్చాడు అనుకున్నారు. తర్వాత ‘మాస్ జాతర’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా.. కిషోర్ తిరుమల సినిమా స్టార్ట్ అవ్వలేదు.దీంతో ప్రాజెక్టు హోల్డ్ లో పడింది అన్నారు.
తర్వాత కొన్ని రోజులకు ఈ ప్రాజెక్టు పక్కన పెట్టేశారు అంటూ కథనాలు వినిపించాయి. ఈ దశలో బడ్జెట్ పెరిగిపోతుండటంతో మార్కెట్ కి సెట్ అవ్వదు అని భావించి నిర్మాతలు ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు అనే గాసిప్స్ కూడా ప్రచారం అయ్యాయి. ఇలాంటి టైంలో రవితేజ- కిర్షోర్ తిరుమల కాంబో మూవీకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ప్రొడక్షన్ హౌస్ నుండే ఈ లీక్ బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.
అందరూ ప్రాజెక్టుని మర్చిపోయారు కాబట్టి ఈ ఇంట్రెస్టింగ్ గాసిప్ తో పరోక్షంగా ‘మా సినిమా ఆగిపోలేదు అనే క్లారిటీ ఇవ్వడం’ ఆ లీక్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సాధారణంగా గుళ్ళ వద్ద ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే మాట నిత్యం వింటూ ఉంటాం. ఇక్కడ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటే సినిమా జోనర్ అలాగే థీమ్ ను కూడా తెలిపినట్టు అయ్యింది. టైటిల్ వినడానికి గమ్మత్తుగా ఉంది. దీంతో చిత్ర బృందం స్ట్రాటెజీ ఫలించిందనే అనుకోవాలి.