Nani: నాని కూడా 100 పర్సెంట్ స్ట్రైక్ రేటుతో..!

100 పర్సెంట్ స్ట్రైక్ రేటు అనగానే ఎక్కువగా క్రికెటర్స్ మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఈ మధ్య పాలిటిక్స్ లో, సినిమాల్లో కూడా ఈ పదాలు వింటున్నాం. పాలిటిక్స్ లో చూసుకుంటే.. గతేడాది ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన జనసేన పార్టీ 21 చోట్ల పోటీ చేసి 21 స్థానాల్లోనూ విజయం సాధించి 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ను సాధించింది. ఇక సినిమాల్లో చూసుకుంటే.. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli) వంద శాతం స్ట్రైక్ రేటుతో దూసుకుపోతున్నాడు.

Nani

అతని తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi)  కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) విజయంతో వంద శాతం స్ట్రైక్ రేటుతో దూసుకుపోతున్నాను అని నిరూపించాడు. ఈ లిస్టులో మరో టాలీవుడ్ హీరో కూడా చేరాడు. అతను మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని (Nani) . అవును.. నాని వంద శాతం స్ట్రైక్ రేటుతో దూసుకుపోతున్నాడు. అలా అని అతను చేసిన సినిమాల్లో ప్లాపులు లేవు అని కాదు. నాని ఖాతాలో ప్లాపులు కూడా ఉన్నాయి. ‘ఈగ’ (Eega) తర్వాత రాజమౌళి మిత్ ను ఎదుర్కొన్న హీరోల్లో నాని కూడా ఒకటి.

అయితే ఒక విషయంలో మాత్రం నాని వంద శాతం సక్సెస్ రేటుని మెయింటైన్ చేస్తున్నాడు. అది నిర్మాతగా కావడం విశేషంగా చెప్పుకోవాలి. అవును నిర్మాతగా నాని ఇప్పటివరకు ‘అ!’ (Awe) ‘హిట్’ (HIT) ‘హిట్ 2’ (HIT 2) వంటి సినిమాలు తీశాడు. అన్నీ హిట్లే. ఇప్పుడు ‘కోర్ట్’ ని (Court) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దీనికి కూడా ప్రీమియర్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత బలమైనదో చూడాలి.

వార్ 2 – కూలీ.. క్లాష్ లేకుండా రాజికొచ్చారు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags