కన్ఫర్మ్ : రిపీట్ అవుతున్న నాని నివేద కాంబినేషన్..!

  • November 1, 2016 / 11:22 AM IST

ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘జెంటిల్ మన్’ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది నివేద థామస్. ఈ సినిమాలో నానికి జోడీగా నటించిన నివేద సినిమా పూర్తయ్యేసరికి అతడికి అభిమానాయిగా మారిపోయింది. ప్రేక్షకులు కూడా నివేద నటనకు ముగ్దులై కలెక్షన్ల రూపంలో తమ అభిమానాన్ని చాటారు. ఆ సినిమా హిట్ అయ్యి, టాలీవుడ్ లో పలు ఆఫర్స్ వస్తున్నా ‘ఎస్’ చెప్పని ఈ మలయాళీ ముద్దుగుమ్మ మళ్ళీ నానితోనే జోడీ కట్టనుంది.

ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘నేను లోకల్’ సినిమా చేస్తున్న నాని ఇది పూర్తవగానే డివివి దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నివేద నటించనున్నట్టు ఇటీవల గుసగుసలు వినిపించగా ఇప్పుడు అదే ఖాయమని తేలింది. ఈ మేరకు నివేద ఓ పాత్రికేయ సమావేశంలో విషయాన్ని బయటపెట్టింది. కోన వెంకట్ సహ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువభాగం యూఎస్ లో జరుగనుందిట. ప్రస్తుతం లొకేషన్ల వేట జరుగుతోంది. డిసెంబర్ లో చిత్రీకరణ మొదలవనున్న ఈ సినిమాతో శివ శంకర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus