నాని, సుధీర్ బాబు చిత్రానికి టైటిల్ అది కాదట..!

‘అష్టాచమ్మా’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘అంతకు ముందు ఆ తరువాత’ ‘బందిపోటు’ ‘జెంటిల్ మేన్’ ‘అమీ తుమీ’ ‘సమ్మోహనం’ వంటి విభిన్నచిత్రాలని తెరకెక్కించి మంచి క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఇప్పుడు తన తరువాత చిత్రాన్ని నాని, సుదీర్ బాబు వంటి హీరోలతో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు గత కొంతకాలంగా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది నిజం కాదని క్లారిటీ వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఓ అచ్చ తెలుగు టైటిల్ నే ఇంద్రగంటి ఈ చిత్రానికి ఫిక్స్ చేసాడని తెలుస్తుంది.

గతంలో వచ్చిన ఇంద్రగంటి టైటిల్స్ చూసుకున్న ‘సమ్మోహనం, ‘అష్టాచమ్మా’ మాదిరిగానే ఈ చిత్రం టైటిల్ కూడా ఉండబోతుందట. ఇక ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి, నివేత థామస్ హీరోయిన్లుగ నటిస్తుండగా.. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థ్రిల్లర్‌ నేపథ్యంలోనే ఈ చిత్ర కథాంశం ఉండబోతుందట. నానికి సుధీర్ బాబుకు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. ఈ చిత్రంలో నాని నెగటివ్ రోల్ పోషిస్తుండగా సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus