Nani , Sujeeth: సుజీత్ సినిమాను పక్కన పెట్టిన నాని.. కారణం అదేనట..!

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే సినిమా రూపొందుతుంది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య  (D. V. V. Danayya) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా..డీవీవీ దానయ్య బ్యానర్లోనే నాని ఇంకో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఇదే బ్యానర్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ‘ఓజి’ (OG) తెరకెక్కిస్తున్న దర్శకుడు సుజీత్ (Sujeeth).. నానితో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ నడిచింది.

‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ నుండి కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటంతో సుజీత్ కి ఖాళీ టైం దొరికింది. కాబట్టి నాని- సుజీత్ ..ల సినిమా వెంటనే సెట్స్ పైకి వెళ్తుంది అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడినట్టు సమాచారం అందింది. అవును నాని- సుజీత్..ల కాంబో మూవీ ఇప్పట్లో ఉండదట.

దానికి కారణాలు లేకపోలేదు..! కథ ప్రకారం ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందట. దానయ్య ఆల్రెడీ ‘ఓజి’ కోసం చాలా పెట్టారు. కాబట్టి.. మళ్ళీ ఎక్కువ బడ్జెట్ తో సినిమా అంటే ఆయన ఇబ్బంది పడుతున్నారట. పోనీ సినిమా కంప్లీట్ చేసినా మార్కెటింగ్ కూడా ఓ రేంజ్లో పెట్టాలి. అందుకే దానయ్య ఇబ్బంది గ్రహించిన నాని.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టినట్లు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus