Nani: దగ్గరుండి నిర్మాతతో ‘ఓజీ’ అప్డేట్ ఇప్పించిన నాని..!

రాజకీయాలా? సినిమాలా? అంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కచ్చితంగా… ‘రాజకీయాలే అని’ చెబుతారు. ప్రజాసేవ కోసమే ఆయన నిలబడ్డారు. ఎన్నికల హడావిడి వల్ల.. సినిమాలను సైతం పవన్ పక్కన పెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ పవన్ కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు 3 ఉన్నాయి.అవే ‘ఓజీ’ (OG) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) . సినిమాలు కంప్లీట్ చేసేంత సమయం ప్రస్తుతం పవన్ కి లేదు. ఆయన డిప్యూటీ సీఎంగానే కాకుండా కీలక మంత్రి శాఖల్లో పనిచేస్తున్నారు.

Nani

అయినప్పటికీ పవన్ ని సినిమాలపై కూడా దృష్టి పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో ‘ ‘ఓజీ’ కంప్లీట్ చేస్తాను..చూద్దురుగాని.. బాగుంటుంది’ అని స్వయంగా పవన్ హామీ ఇచ్చారు. రీ ఎంట్రీ తర్వాత పవన్ చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. గ్లింప్స్ కూడా అదిరిపోయింది. అయితే ఓజీ అప్డేట్ లేక ఫ్యాన్స్ డల్ అయిపోయారు. అయితే ఈరోజు నాని దయవల్ల ‘ఓజీ’ అప్డేట్ వచ్చింది. అదెలా అంటే.. నాని (Nani)  – వివేక్ ఆత్రేయ (Vivek Athreya)  కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ’  (Ante Sundaraniki)  తర్వాత ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే యాక్షన్ మూవీ రాబోతుంది.

ఆగస్టు 29 న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఈరోజు ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. ‘ఓజీ’ కి ‘సరిపోదా శనివారం’ కి నిర్మాత డీవీవీ దానయ్యే (DVV Danayya) అనే సంగతి తెలిసిందే. దీంతో దానయ్య స్టేజ్ పై మాట్లాడుతున్న టైంలో నాని ‘ఓజీ’ అప్డేట్ కావాలని డిమాండ్ చేశారు. అందుకు ఆడిటోరియంలో ఉన్నవాళ్ళంతా గట్టిగా ‘ఓజీ’ అంటూ నినాదాలు తీయడం జరిగింది. దీంతో దానయ్య అప్డేట్ ఇవ్వక తప్పలేదు. ‘త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభిస్తున్నామంటూ’ నిర్మాత దానయ్య చెప్పారు.

సో అతి త్వరలో ‘ఓజీ’ ని చూసే అవకాశం ఉండొచ్చన్నమాట. మరోపక్క ఈ అప్డేట్ ఇప్పించినందుకు.. నాని మరోసారి పవన్ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. గతంలో కూడా టికెట్ రేట్ల టైంలో అప్పటి ప్రభుత్వానికి చెందిన నేతలు నానిని విమర్శించడం జరిగింది. అప్పుడు పవన్.. నానికి మద్దతు పలికి అండగా నిలబడ్డారు. ‘అంటే సుందరానికీ!’ ప్రీ రిలీజ్ కి కూడా పవన్ గెస్ట్ గా వచ్చిన నానిని ప్రసంసించారు. ఇప్పుడు మరోసారి పవన్ ఫ్యాన్స్ అటెన్షన్ ను డ్రా చేశాడు నాని.

‘సరిపోదా శనివారం’ కథ మొత్తం చెప్పేశాడు.. చూశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus