Nani , Fahadh Faasil: ఆ సినిమాకు ఫహద్ ఫాజిల్, నాని నో చెప్పడానికి అసలు కారణాలివే!

సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల కెరీర్ బాగుండాలంటే ఆ సెలబ్రిటీలు కెరీర్ కు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. ఎంచుకునే పాత్రలు, సినిమాలకు సంబంధించి పొరపాట్లు చేస్తే మాత్రం కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఫహద్ ఫాజిల్  (Fahadh Faasil) , నాని (Nani) రజనీకాంత్ (Rajinikanth) సినిమాలో రోల్ రిజెక్ట్ చేశారని వస్తున్న కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. వెట్టయాన్ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం మేకర్స్ ఫహద్ ఫాజిల్, నానిలను సంప్రదించగా ఆ రోల్ తమ రేంజ్ కు తగ్గ రోల్ కాకపోవడంతో వాళ్లు రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఫహద్ ఫాజిల్, నాని జడ్జిమెంట్ విషయంలో ఇంత పర్ఫెక్ట్ గా ఉండటం వల్లే వాళ్లకు భారీ విజయాలు దక్కుతున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వెట్టయాన్ (Vettaiyan) సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదలవుతుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. జైలర్ (Jailer) సక్సెస్ తర్వాత రజనీకాంత్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది.

రజనీకాంత్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రజనీకాంత్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ ఉండటం రజనీకాంత్ కు ప్లస్ అవుతోంది.

రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో కూలి టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఏడు పదుల వయస్సులో సైతం అంతకంతకూ కష్టపడుతూ విజయాలు సాధించడం రజనీకాంత్ కే సాధ్యమవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పాన్ ఇండియా హిట్లను అందుకోవడం ద్వారా రజనీకాంత్ కు క్రేజ్ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus