సల్మాన్ తో సమరానికి సిద్ధమంటున్న నాని!

బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లే తమతో సమానమైన క్రేజ్ కలిగిన సల్మాన్ ఖాన్ సినిమా రిలీజవుతుందంటే.. ముందుగానే మాట్లాడుకొని తమ సినిమాలు ఆ టైమ్ లో రిలీజవ్వకుండా చూసుకొంటుంటారు. అలాంటిది ఓ యువ హీరో తన తాజా చిత్రంతో సల్మాన్ ఖాన్ కు గట్టి పోటీనిస్తానంటున్నాడు. ఆ యువ హీరో ఎవరో కాదండి మన నాని. వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్న నాని కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “ఎం.సి.ఏ”. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలవుతోంది. దాంతో.. సరిగ్గా మరుసటిరోజు విడుదలవుతున్న అఖిల్ రెండో చిత్రం “హెల్లో”కి నాని సినిమా పోటీ అవుతుందని అందరూ భావిస్తుండగా.. నాని మాత్రం పోటీ మా ఇద్దరి మధ్య కాదు.. మేం ఇద్దరం కలిసి డిసెంబర్ 22న “టైగర్ జిందా హై”గా వస్తున్న సల్మాన్ ఖాన్ కి పోటీ ఇస్తామంటున్నాడు నాని.

సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతే నాని ఆ స్థాయిలో ఏకంగా సల్మాన్ ఖాన్ కే పోటీ ఇస్తానని చెప్పొచ్చు. నిజానికి సల్మాన్ ఖాక్ కి ఉన్న క్రేజ్ అండ్ పాపులారిటీలో సగం కూడా నానీకి లేదు. అయితే.. తన ప్రీవీయస్ మూవీస్ రికార్డ్స్ మరియు తాజా సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ లో నాని అలా అన్నాడో లేక త్వరలో తాను కలిసి నటించబోయే నాగార్జునగారి అబ్బాయి అఖిల్ సినిమాకి తన సినిమా పోటీ కాదు అని ఇండైరెక్ట్ గా చెప్పాడో అనేది అర్ధమవ్వాలంటే డిసెంబర్ 23 వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే.. “ఎం.సి.ఏ, హెల్లో” సినిమాల రిజల్ట్స్ అప్పటికల్లా తెలిసిపోతాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus