Hero Nani: ఆ సినిమాపైనే నాని కెరీర్ ఆధారపడి ఉందా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన నాని నటించిన అంటే సుందరానికి ఈ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. 2 గంటల 56 నిమిషాల నిడివితో విడుదల కావడం కూడా ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం నాని దసరా సినిమాలో నటిస్తున్నారు. ఒక విధంగా ఈ సినిమాపైనే నాని కెరీర్ పూర్తిస్థాయిలో ఆధారపడి ఉందని చెప్పవచ్చు. 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనా కనీసం 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుంది. ఈ సినిమా కోసం నాని తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు.

నానికి జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సర్కారు వారి పాట హిట్టైనా తెలుగులో కీర్తి సురేష్ కు ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు రాలేదనే సంగతి తెలిసిందే. దసరా సక్సెస్ కీర్తి సురేష్ కెరీర్ కు కూడా కీలకం కానుంది. కీర్తి సురేష్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దసరా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే నాని భవిష్యత్తు సినిమాల బడ్జెట్ తగ్గే ఛాన్స్ ఉంది.

అంటే సుందరానికి సినిమా ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చినా ఫస్ట్ వీకెండ్ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించడంలో ఈ సినిమా ఫెయిలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఖాతాలో ఈ సినిమాతో ఫ్లాప్ చేరింది. నాని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus