Hero Nani: రెండు రోజుల్లోనే వాళ్ళ షూటింగ్ అయిపోతుందట..!

క్లాప్ బాయ్ గా,అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన నాని..దర్శకుడు ఇంద్రగంటి కంట్లో పడడంతో ‘అష్టా చమ్మా’ తో హీరోగా మారాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు 2,3 హిట్లు కొట్టగానే మాయమైపోతారు అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసి..ఈ 13 ఏళ్లలో అంచెలంచెలుగా ఎదిగాడు నాని.విభిన్న కథా చిత్రాలు చేస్తూ టాప్ హీరోగా ఎదిగిన నాని నిర్మాత‌గానూ స‌క్సెస్ సాధించాడు. నిర్మాతగా మారి నాని చేసిన మొదటి చిత్రం ‘అ!’ .ఇది హిట్ అయ్యింది. తర్వాత విశ్వక్ సేన్ తో ‘హిట్’ అనే థ్రిల్లర్ మూవీ చేసాడు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. నానికి లాభాలను తెచ్చిపెట్టింది.

కేవలం రెండే రెండు షెడ్యూల్స్ లో నాని ఈ చిత్రాలను ఫినిష్ చేసాడు. ప్రస్తుతం `మీట్ క్యూట్` అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. ఇది ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ అని టాక్. ఈ మూవీలో 5 లేదా 6 మంది హీరోయిన్లు ఉంటారట.అందుకోసం మంచి క్రేజ్ ను ఉన్న హీరోయిన్లనే నాని ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు రెండు రోజులు షూటింగ్ లో పాల్గొంటే చాలు వీళ్ళ పార్ట్ ఫినిష్ అయిపోతుంది.డబ్బింగ్ కూడా ఈ రెండు రోజుల్లోనే చెప్పించేస్తాడట. ఇందుకోసం ఆ హీరోయిన్ల‌కు గెస్ట్ రోల్స్ అని చెప్పి ఒప్పించాడట నాని. నిజానికి ఇలా ఒక‌ట్రెండు రోజుల పాత్ర‌లంటే ఎవ్వరూ ఒప్పుకోరు.

ఒకవేళ ఒప్పుకున్నా అందుకు భారీగా డిమాండ్ చేస్తారు. కానీ.. నాని క్రేజ్ ఉన్న హీరో కాబట్టి.. తర్వాత సినిమాలో ఛాన్స్ ఇస్తాడేమో అని భావించి వీళ్ళు ఓకె చెప్పేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇది కూడా రెండు షెడ్యూల్స్ లో రూ.3 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ అయిపోతుంది.ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే తక్కువలో తక్కువ శాటిలైట్,డిజిటల్, థియేట్రికల్ ఇలా అన్నీ కలుపుకుని రూ.10 కోట్ల వరకు జరిగే అవకాశం ఉంది.కాబట్టి ఇది.. నానికి ఇది ప్రాఫిటబుల్ అని చెప్పొచ్చు. పైగా కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడనే మంచి పేరు కూడా ఉంటుంది.ఏమైనా నాని తెలివితేటలను మెచ్చుకోవాల్సిందే..!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus