Nani: అప్పుడు వద్దనుకున్న దర్శకుడితో నాని.. ఏం ప్లాన్‌ చేస్తున్నట్లో?

‘హిట్‌ 3’ సినిమాకు ముందు నాని (Nani) కొత్త సినిమా ఏది అనే చర్చకు ఓ సమాధానంగా శిబి చక్రవర్తి (Cibi Chakaravarthi) పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడే కొన్ని రోజులు ఉండి కథ మీద కసరత్తులు చేశారు. కానీ ఏమైందో ఏమో ఆ సినిమా అనుకోకుండా అలా ఉండిపోయింది. ఈ లోపు నాని వేరే సినిమా అనౌన్స్‌ చేశారు. శిబి కూడా వేరే సినిమా పనుల్లోకి వెళ్లిపోయారు. కట్‌ చేస్తే ఇప్పుడు మళ్లీ ఆ సినిమా తిరిగి పట్టాలెక్కనుంది అని అంటున్నారు.

Nani

అవును శిబి చక్రవర్తి సినిమా మళ్లీ ముందుకొచ్చింది అని చెబుతున్నారు. ఈసారి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘హిట్‌ 3’ సినిమా తర్వాత ఈ సినిమాను స్టార్ట్ అవ్వొచ్చు అని చెబుతున్నారు. ఏడాదిన్నర క్రితమే నాంది పడిన ఈ సినిమా పనులు తిరిగి స్టార్ట్‌ చేయాలని శిబి ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలో మళ్లీ హైదరాబాద్‌లో సినిమా ఆఫీసును స్టార్ట్‌ చేసి పనులు వేగవంతం చేస్తారు అని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

శిబి చక్రవర్తి ఇప్పటివరకు ఒక్క సినిమాకే దర్శకత్వం వహించారు. అదే శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) ‘డాన్’ (Don). ఆ సినిమాలో కామెడీ, ఎమోషన్స్ చక్కగా మిక్స్‌ చేసి అందించారు దర్శకుడు. ఆ సినిమా చూసే నాని ఆయన్ను పిలిపించారు. ఇక్కడ కూడా అలాంటి కథనే సిద్ధం చేసే ఆలోచన చేశారట. ఎందుకో కానీ అప్పుడు ప్రాసెస్‌ ఆగిపోయింది. మరిప్పుడు స్టార్ట్‌ చేయనున్న సినిమా కథ ఎలా ఉంటుంది అనేది చూడాలి.

ఇక నాని సంగతి చూస్తే.. ప్రస్తుతం ‘హిట్‌ 3’ సినిమా పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘ప్యారడైజ్‌’ సినిమా పనులు స్పీడప్‌ చేస్తారట. ఈ సినిమాలను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పటికే ‘సరిపోదా శనివారం’తో (Saripodhaa Sanivaaram) కాస్త పాన్‌ ఇండియా వైబ్‌లోకి వచ్చిన నాని ఈ సినిమాలతో ఇంకాస్త పెంచుకుందాం అని అనుకుంటున్నారట. ఈ రెండు సినిమాల తర్వాతే శిబి సినిమా ఉండొచ్చట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus