నేచురల్ స్టార్ నాని (Nani) మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ ప్లేస్లో ఉన్న హీరో. కన్సిస్టెంట్ గా హిట్లు కొడుతూ తన మార్కెట్ ను నిలబెట్టుకుంటున్నాడు. ‘దసరా'(Dasara) ‘హాయ్ నాన్న’ (Hi Nanna) , సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram) వంటి సూపర్ హిట్ సినిమాలతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో ‘హిట్ 3’ (HIT3) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. మరోపక్క నాని ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
‘వాల్ పోస్టర్ సినిమా’ అనే బ్యానర్ పై తన సోదరి ప్రశాంతి తిపిర్నేనితో (Prashanti Tipirneni) కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ బ్యానర్ పై వచ్చిన ‘అ!’ (Awe) ‘హిట్’ ‘హిట్ 2’ ‘కోర్ట్’ (Court) వంటి సినిమాలు అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. ‘మీట్ క్యూట్’ అనే వెబ్ సిరీస్ కి కూడా మంచి పేరు వచ్చింది. దీంతో కొత్త ట్యాలెంట్ ను నాని బాగా ఎంకరేజ్ చేస్తాడు అని అంతా అనుకున్నారు. మార్కెట్లో ఉన్న మరింత మంది కొత్త కుర్రాళ్ళకి అవకాశాలు దక్కుతాయి అని అంతా అనుకున్నారు.
కానీ అందరూ అనుకున్నంత గొప్ప నిర్ణయాలు ఈ బ్యానర్లో తీసుకోవడం లేదు అని టాక్. కొత్త వాళ్ళు ఎవరైనా కథలు చెప్పడానికి ఈ సంస్థ గేట్లు ధాటి వెళ్తే.. ఇప్పుడు కొత్త కథలు ఏమీ నాని అండ్ టీం వినడం లేదట. నాని ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యి వస్తే.. వాళ్ళ కథలు మాత్రమే వింటున్నారట. వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారట. శైలేష్ కొలను (Sailesh Kolanu) నాని ఫ్యామిలీ ఫ్రెండ్.
ప్రశాంత్ వర్మ (Prasanth Varma), రామ్ జగదీష్ వంటి వారు కూడా నాని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి చెందిన వారే. నాని సోదరి దీప్తి గంట ఈ బ్యానర్లో ఓ చిన్న సినిమా చేయబోతుంది. దీంతో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి ఓ ఓటీటీ ప్రాజెక్టు ఈ సంస్థ నిర్మించనుందట. ఇవి కంప్లీట్ అయ్యే వరకు కొత్త కథలు ఓకే చేసే అవకాశాలు లేవు. సో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ అనేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రమే అని అర్ధం చేసుకోవచ్చు.